E-Paper
Advertisement

రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. ఎలా పొందాలంటే?

రైలు ప్రయాణికులకు బంపరాఫర్..  45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. ఎలా పొందాలంటే?
Advertisement

Railway Travel Insurance: ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం 45 పైసల స్వల్ప ప్రీమియంతో రూ. 10 లక్షల వరకు ప్రయాణ బీమా పొందే అవకాశాన్ని ఇప్పుడు కౌంటర్ టికెట్ కొనుగోలుదారులకు కూడా విస్తరించింది. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం ఆన్‌లైన్‌లో ఐఆర్‌సిటిసి (IRCTC) ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ నిర్ణయంతో రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నేరుగా టికెట్లు కొనుగోలు చేసే లక్షలాది మంది ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది.

బీమా ఎలా పొందాలి?

కౌంటర్లలో రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు ఈ ఐచ్ఛిక (Optional) బీమా సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. దీని కోసం ప్రతి ప్రయాణికుడు కేవలం 45 పైసలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రయాణ సమయంలో ఏవైనా దురదృష్టకర రైలు ప్రమాదాలు, దుర్ఘటనలు చోటుచేసుకుంటే.. పాలసీ నిబంధనలకు లోబడి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. అయితే ప్రమాద తీవ్రత, నష్టం ఆధారంగా పరి పరిహారంలో మార్పులు ఉంటాయని రైల్వే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి టికెట్ తీసుకునే సమయంలోనే బీమా రూల్స్, క్లెయిమ్ ప్రక్రియ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

భద్రతకు బీమా ఒక్కటే సరిపోదు!

Advertisement

ప్రమాదం జరిగిన తర్వాత ఆర్థికంగా ఆదుకోవడానికి బీమా ఉపయోగపడుతుంది కానీ అది ప్రమాదాలను నివారించలేదు. ప్రయాణికుల భద్రత అనేది రైల్వే మౌలిక వసతులు, కోచ్‌ల నాణ్యత, సరైన నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది. రైలు కోచ్‌ల లోపలి భాగాలు నిరంతరం ప్రయాణికుల రాకపోకల వల్ల అరిగిపోతుంటాయి. దెబ్బతిన్న విడిభాగాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి బాగు చేయడం వల్ల ప్రమాదాల ముప్పును చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ. 123కే అపరిమిత కాల్స్, డేటా, సినిమాలు.. మిస్ అవ్వకండి!

కోచ్‌ల నిర్వహణపై శ్రద్ద అవసరం

Advertisement

ప్రస్తుతం భారతీయ రైల్వే ఆధునీకరణ దిశగా పయనిస్తోంది. కొత్తగా అధునాతన రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐసీఎఫ్ (ICF), ఎల్‌హెచ్‌బి (LHB) కోచ్‌ల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. నాణ్యతా పరీక్షలు, క్రమం తప్పకుండా నిర్వహించే తనిఖీలు, పాత విడిభాగాల మార్పిడి వంటి చర్యలు రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయని అభిప్రాయపడుతున్నారు. మెుత్తంగా 45 పైసలకే బీమా సౌకర్యాన్ని కౌంటర్ ప్రయాణికులకు కూడా అందించడం రైల్వే తీసుకున్న గొప్ప నిర్ణయం. అయితే ఈ ఆర్థిక రక్షణతో పాటు కఠినమైన భద్రతా ప్రమాణాలు రైళ్లల్లో పాటిస్తేనే ప్రయాణికులకు నిజమైన రక్షణ లభిస్తుందని చెప్పవచ్చు.

Also Read: నటుడు కావాలనే కల.. కుటుంబ ఒత్తిడితో చదువు.. చివరకు 19వ అంతస్తు నుంచి దూకి..!

Tags

Related News

బెంగళూరు–ముంబై వందేభారత్ స్లీపర్‌కు రైల్వే బోర్డు ఆమోదం.. ప్రారంభం ఎప్పుడంటే?

చేతిలో ఐఫోన్.. చెవుల్లో ఇయర్‌ఫోన్స్.. రైలు ఢీకొని 17 ఏళ్ల బాలుడు బలి!

ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణం ఇక 9 గంటలే.. కొత్త వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. వందే భారత్ సహా 42 రైళ్లు రద్దు!

నల్లగొండలో యాక్సిడెంట్లకు చెక్.. నాలుగు లైన్లుగా సాగర్ రోడ్డు విస్తరణ!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు, కొన్నింటికి టైమింగ్స్ మార్పు

అయ్యప్ప భక్తులకు బిగ్ అప్‌డేట్.. శబరిమల యాత్రకు వర్చువల్ బుకింగ్స్ స్టార్ట్!

Big Stories

Advertisement
×