BigTV English

Vijay Kanakamedala: మెగా అభిమానులకు సారీ చెప్పిన భైరవం దర్శకుడు

Vijay Kanakamedala: మెగా అభిమానులకు సారీ చెప్పిన భైరవం దర్శకుడు

Vijay Kanakamedala: హరీష్ శంకర్ దగ్గర శిష్యరికం చేసి నాంది సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు విజయ కనకమేడల. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అల్లరి నరేష్ లోని సరికొత్త యాంగిల్ బయటకు తీశాడు అంటూ దర్శకుడికి విపరీతమైన ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ సినిమా తర్వాత చేసిన ఉగ్రం సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం ముగ్గురు యంగ్ హీరోలతో భైరవం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మీది కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు విజయ్.


ఎక్కువమంది మెగా హీరోలతో పని చేశా

మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నారు. కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక 30 మినిట్స్ నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది. ఎప్పుడో 2011లో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు.. ఏదో జరిగింది.. హ్యాక్ అయి ఉంటుంది. నేను అందరు హీరోలతో పని చేశాను.. ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే.


మెగాస్టార్ పవర్ స్టార్ సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను

మెగా హీరోలు అందరితోనూ నాకు సానిహిత్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి. అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని..! అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను.. అలాంటి తప్పు ఎందుకు చేస్తాను..?

నా అకౌంట్ హ్యాక్ అయింది

నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది.. తెలిసో తెలియకో జరిగింది.. అది హ్యాక్ అయింది.. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను.. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు.. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు.. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికీ.. మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను.అంటూ క్లారిటీ ఇచ్చాడు విజయ్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×