Benz Promo:మల్టీ టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తాజాగా నటిస్తున్న చిత్రం బెంజ్ (BENZ). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఒక్క ఫస్ట్ లుక్ మినహా మరేది కూడా అప్డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో రీసెంట్ గా ప్రముఖ ఫేమస్ నటుడు నివిన్ పౌలీ (Nivin Pauly)కూడా నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా నివిన్ పౌలీని పరిచయం చేస్తూ బెంజ్ మూవీ నుండి ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో అత్యంత భయానకంగా.. అంతే ఆశ్చర్యంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. పైగా ఈ టీజర్ లో నివిన్ పౌలీ గోల్డ్ మ్యాన్ గా కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇక తాజాగా ఈ బెంజ్ మూవీకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా మారింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ బెంజ్ సినిమాలో నివిన్ పౌలీ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
బెంజ్ మూవీ ప్రోమోలో ఏముందంటే?
ప్రోమో స్టార్ట్ అవ్వగానే కుక్క మొరుగుతున్నట్టు చూపించారు. ఇక వెంటనే నివిన్ పౌలీ విలన్ గెటప్ లో మెడ నిండా బంగారు హారాలతో మసకగా కనిపిస్తూ.. ఒక్కసారిగా దర్శనమిస్తారు. ఇక ఆయన లుక్ చూడగానే అర్థమవ్వదు కానీ నెమ్మదిగా ప్రోమో సాగే కొద్దీ ఇందులో చాలా భయంకరమైన విలన్ గా మనకు కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. రక్తం మడుగుల్లో కనిపిస్తూ ఒంటినిండా బంగారం పైగా బంగారంతో చేసిన సుత్తిని పట్టుకొని తిరుగుతూ చూసే ఆడియన్స్ లో భయాన్ని రేకెత్తిస్తున్నారు.
దీనికి తోడు లేడీ విగ్రహాలు.. అందులోనూ బట్టలు లేకుండా చూపించి మరింత భయానకం సృష్టించారు. పైగా ఏదో రక్తంతో కూడిన వంటకాన్ని ఆయన టేస్ట్ చేస్తూ B..E..N..S.. కాదు కాదు ఏబిసిడి లెటర్స్ లో చివరన వస్తుందే.. ఈ జెడ్..Z.. ఇది BENZ అంటూ కామెంట్ చేస్తాడు. ఇక మొత్తానికి అయితే ఈ విలన్ కి సంబంధించిన ఈ ప్రోమో మాత్రం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం తమిళ్ భాషలో ప్రోమోని విడుదల చేశారు.
నివిన్ పౌలీ కెరియర్..
నివిన్ పౌలీ విషయానికి వస్తే.. సినీ నటుడిగా, నిర్మాతగా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎక్కువగా మలయాళం భాష సినిమాలలో నటించారు. 2009లో వినీత్ శ్రీనివాస దర్శకత్వం వహించిన ‘మలర్వాడి ఆర్ట్స్ క్లబ్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఆ తర్వాత కొన్ని కొన్ని సినిమాలలో అతిధి పాత్రలు, చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇక మళ్లీ వినీత శ్రీనివాసన్ దర్శకత్వంలో వచ్చిన ‘తట్టతిన్ మరయాదు’ అనే సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్ కు మైలురాయిగా నిలిచింది. ఇక తర్వాత తమిళ్, మలయాళం లో సినిమాలు చేస్తూ.. నిర్మిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు రాఘవ లారెన్స్ సినిమాలో విలన్ గా అవతరించారు.. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
also read:Bhairavam: ‘భైరవం’ అట్టర్ ఫ్లాప్.. స్టార్ హీరోల సినిమాకు కనీసం రూ.10 కోట్లు కూడా రాలేదే?