BigTV English
Advertisement

Bhairavam Movie: ‘భైరవం’ అట్టర్ ఫ్లాప్.. స్టార్ హీరోల సినిమాకు కనీసం రూ.10 కోట్లు కూడా రాలేదే?

Bhairavam Movie: ‘భైరవం’ అట్టర్ ఫ్లాప్.. స్టార్ హీరోల సినిమాకు కనీసం రూ.10 కోట్లు కూడా రాలేదే?

Bhairavam Movie: సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohit), మరొకవైపు తొమ్మిదేళ్లు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకొని, కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ (Manchu Manoj) ఇలా ఈ ముగ్గురు కలిసి ఒకే వేదికపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.అలా ప్రముఖ డైరెక్టర్ విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కూతురు అదితి శంకర్(Aditi Shankar) హీరోయిన్ గా తొలి పరిచయం అవుతూ మే 30వ తేదీన థియేటర్లలోకి వచ్చిన చిత్రం భైరవం(Bhairavam).


ఈమెతో పాటు ఈ సినిమాలో దివ్య పిళ్లై(Divya pillai), ఆనంది (Anandi)కూడా హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య మరెన్నో ప్రమోషన్స్ నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పైగా ముగ్గురు స్టార్స్ ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముగ్గురు స్టార్ హీరోలు.. బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం రూ.10 కోట్లు కూడా రాబట్ట లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

పేరుకే ముగ్గురు స్టార్ హీరోలు.. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్


పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు , ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి మొత్తంగా ఈ భైరవం చిత్రానికి రూ.40 కోట్లకు పైగానే కేటాయించారు. అయితే ముగ్గురు స్టార్స్.. పైగా ముగ్గురు కూడా నెపోకిడ్స్ కావడంతో కాస్త భారీగానే ధరలు పలికాయి. అలా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను జీ స్టూడియోస్ వారు రూ.30 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ సినిమా విడుదలై నాలుగు రోజులు పూర్తయింది.

ప్రస్తుతం ఐదవ రోజు కలెక్షన్స్ కొనసాగుతున్నా.. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ గా ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పటివరకు కేవలం రూ.10 కోట్లు కూడా వసూలు చేయకపోవడం గమనార్హం. ఇక దీని బట్టి చూస్తే ముగ్గురు స్టార్ హీరోలు.. ముగ్గురు కూడా లీడింగ్ హీరోలే.. అలాంటిది బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.10 కోట్లు కూడా రాబట్టలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ ఫ్లాప్ గా నిలవడంతో ఈ ముగ్గురు హీరోస్ కూడా మళ్లీ సక్సెస్ కోసం ఎదురుచూడాల్సిందే.

భైరవం సినిమా రివ్యూ..

దేవిపురం అనే ఒక గ్రామం.. అక్కడ వారాహి అమ్మ వారి టెంపుల్ చాలా పవిత్రమైనది. దీనికి నాగరత్నమ్మ పెద్దగా ఉండి, అన్ని కార్యాలు చక్కబెడుతూ ఉంటుంది. ఈమె మనవడు గజపతి. అతడి స్నేహితులు వరద, శ్రీను ఉంటారు. వారిని కూడా నాగరత్నమ్మ సమానంగా పెంచుతుంది. ఆ తర్వాత ఆమె చనిపోతుంది. దీంతో ఆ గుడిపై నాగరాజు కన్నేస్తారు. ఇక ఆ ముగ్గురు స్నేహితులు అతనికి ఎదురెళ్లి ఆ గుడిని కాపాడుకుంటారా? గుడిని కాపాడుకునే క్రమంలో స్నేహితుల మధ్య మనస్పర్ధలు వస్తాయి.

అది ఎంతవరకు వెళ్తాయంటే.. గజపతి వరదను చంపేంత.. అలాగే గజపతిని శ్రీను చంపాల్సినంత రేంజ్కి వెళ్తాయి. అసలు వీళ్ళ మధ్య చోటు చేసుకున్న మనస్పర్ధలు ఏంటి? నాగరాజు ఎందుకు ఆ గుడిపై కన్నేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. అయితే సెకండ్ హాఫ్ మైనస్ గా నిలిచింది. అంతేకాదు కథకు ఆత్మ మిస్ అవ్వడం వల్ల పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

also read:HBD Prashanth Neel:ఎన్టీఆర్ సమక్షంలో ఘనంగా నీల్ బర్తడే సెలబ్రేషన్స్.. హైలెట్ ఏంటంటే?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×