BigTV English

Sweden islands : స్వీడన్‌‌ .. ఆసక్తికర విశేషాలెన్నో? ఆ దేశంలో ఎన్ని దీవులు ఉన్నాయో తెలుసా?

Sweden islands : స్వీడన్‌‌ .. ఆసక్తికర విశేషాలెన్నో?  ఆ దేశంలో ఎన్ని దీవులు ఉన్నాయో తెలుసా?
sweden islands

Sweden islands : ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రంగా ఉండే మెట్రోనగరాల్లో స్టాక్‌హోం ఒకటి. స్వీడన్ రాజధాని అయిన ఈ మెట్రోనగరం.. 14 దీవులు, 50 బ్రిడ్జిల సమాహారం. అత్యధిక దీవులు కలిగిన దేశం కూడా స్వీడనే.


ప్రపంచంలోనే అత్యధికంగా ఈ దేశానికి 2,67,570 దీవులు ఉన్నాయి. వాటిలో ఎక్కువభాగం ఆవాసాలు లేనివే. జపాన్ దేశానికి కూడా ఐలాండ్స్ తక్కువేమీ లేవు. లోకానికి తెలిసిన వాటి కంటే ఎక్కువ సంఖ్యలోనే దీవులు ఉన్నట్టు ఈ ఏడాది మార్చిలో వెల్లడైంది.

6,852 నుంచి 14,125 వరకు ఉండొచ్చని జపాన్ ప్రభుత్వం తేల్చింది. సర్వేయింగ్ టెక్నాలజీ పెరగడంతో పాటు ఏరియల్ ఫొటోగ్రఫీ అందుబాటులోకి రావడంతో దీవుల కచ్చిత గణన సాధ్యమైంది. స్వీడన్ తర్వాత 2,39,057 దీవులతో నార్వే రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో ఉన్న ఫిన్లాండ్ దేశానికి 1,78,947 ఐలాండ్స్ ఉన్నాయి.


కెనడాకు 52,455 దీవులు, అమెరికాకు 18,617 దీవులు ఉన్నట్టు తేలింది. జపాన్ దేశానికి 14,125, ఆస్ట్రేలియా 8,222, ఫిలిప్పీన్స్ దేశానికి 7,641 దీవులు ఉన్నాయి. 5 వేల నుంచి 3500 వరకు ఐలాండ్స్ కలిగిన దేశాల జాబితాలో చిలీ, చైనా, దక్షిణ కొరియా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా ఉన్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×