
Bharateeyudu 2 : కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2 చిత్రానికి సంబంధించిన కొన్ని షూటింగ్ సన్నివేశాలు ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. భారతీయుడు చిత్రం ఎటువంటి సంచలమైన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ మూవీ సీక్వెల్ పై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా రీసెంట్ గా కమల్ నటించిన విక్రమ్ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ వస్తున్న కమల్ మూవీ పై హైప్ బాగానే ఉంది.
ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. విజయవాడలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ కోసం శంకర్ భారీ సెట్టింగ్ ఏర్పాటు చేయడంతో షూటింగ్ చూడడానికి జనాలు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఇక ఈ సెట్స్ లో కమలహాసన్ భారతీయుడు గెటప్ లో అందరిని ఆకట్టుకుంటున్నారు. షూటింగ్ సెట్స్ లో భారతీయుడు ఫైట్ సీన్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయంట.
కమల్ అలియాస్ సేనాపతి.. అదేనండి మన భారతీయుడు.. ఒకపక్క తనపై జరుగుతున్న రాళ్లదాడి ని ఒంటి చేత్తో ఎదుర్కొంటూ ఉన్నాడు. సేనాపతిని అంతం చేయాలి అనే ఆలోచనతో ఏకమైన శత్రుమూకలంతా అతనిపై అతనిపై రాళ్ల వర్షం కురిపిస్తుంటే.. సేనాపతి ఏమాత్రం వెనుకంజ వేయకుండా చేతులతోనే పోరాటం చేస్తున్నాడు. వినడానికి ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్న ఈ యాక్షన్ సన్నివేశాని ప్రస్తుతం శంకర్ విజయవాడలో కమల్ పై చిత్రీకరిస్తున్నారు.నాలుగు రోజులుగా విజయవాడలో జరుగుతున్న ఈ షూటింగ్స్ లో శుక్రవారం నాడు కమల్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఇక షూటింగ్ చూడడానికి తరలి వస్తున్న జనం విజువల్స్ కూడా క్యాప్చర్ చేస్తున్నారు చిత్ర బృందం. వీటిని సినిమాలో అవసరం మేర ఉపయోగించే అవకాశం ఉంది. విజయవాడ లో షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇంకొని కీలక సన్నివేశాల షూటింగ్ విశాఖపట్టణంలో చిత్రీకరించనున్నారు. విశాఖలోని ఆంధ్రాయూనివర్శిటీలో ఈ షూటింగ్ జరుగుతుందని టాక్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే సన్నివేశాలు కోసం యూనివర్శిటీ లో షూటింగ్ జరపడానికి కావలసిన ముందస్తు పర్మిషన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భారతీయుడు 2 లో ఫైటింగ్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అని అర్దం అవుతుంది.
Honeyrose: అది హీరోయిన్స్ పర్సనల్ ఛాయిస్.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన హనీరోజ్