E-Paper
Advertisement

Bhargav Ram: ఎన్టీఆర్ రెండో కొడుకు.. అబ్బా.. ఎంత క్యూట్ ఉన్నాడో..

Bhargav Ram: ఎన్టీఆర్ రెండో కొడుకు.. అబ్బా.. ఎంత క్యూట్ ఉన్నాడో..
Advertisement

Bhargav Ram: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. నేడు మరో సినిమాకు ముహూర్తం పెట్టేశాడు. కేజీఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ సలార్ తరువాత ఎన్టీఆర్ 31ను మొదలుపెట్టాడు. నేడు ఘనంగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది.

మొదటిసారి ఎన్టీఆర్ ఈ పూజా కార్యక్రమానికి కుటుంబంతో సహా హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్ లో హైలైట్ గా మారాడు ఎన్టీఆర్ రెండో కొడుకు భార్గవ్ రామ్. 2011 లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. 2014లో ఈ జంటకు అభయ్ రామ్ జన్మించాడు. ఇక 2018లో భార్గవ్ రామ్ పుట్టాడు. ఇద్దరు పిల్లల తరువాత ఎన్టీఆర్ కు వారే లోకంగా మారిపోయారు.

Advertisement

అయితే సినిమాలు.. లేకపోతే పిల్లలతో ఆడుకోవడమే ఎన్టీఆర్ పనిగా మారిపోయింది. అభయ్ చాలా సైలెంట్. భార్గవ్ చాలా అల్లరి అని ఎన్టీఆర్ ఎన్నోసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అభయ్ పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అని, ఏది అనిపిస్తే అది అడిగేస్తాడు అని, ఆ ప్రశ్నలు తట్టుకోలేక ప్రణతిని ఇరికిస్తా అని చెప్పుకొచ్చాడు. ఇక భార్గవ్ అల్లరి భరించడం చాలా కష్టమని తెలిపాడు.

ఇక భార్గవ్ లుక్ మొత్తం తండ్రి ఎన్టీఆర్ నే గుర్తుచేస్తుంది. చిన్నతనంలో ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో.. ఇప్పుడు భార్గవ్ ను చూస్తే అలాగే అనిపిస్తుంది. ఈ అన్నదమ్ములు మీడియా కంటికి చిక్కడం చాలా అరుదు. ఇదుగో ఇలా సడెన్ గా ఎప్పుడైనా కనిపించినా.. ఎక్కువ అందరి చూపు భార్గవ్ మీదకే వెళ్తుంది. తండ్రి పక్కన నడుస్తూ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బుల్లి టైగర్  భలే ముద్దొస్తున్నాడే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×