Tanveer Ahmed On Virat Kohli: టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బుధవారం రోజున ఐదు మ్యాచ్లు వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండ్ తో చివరి వరకు నిలబడి మ్యాచ్ గెలిపించాడు. రోహిత్ శర్మ మాత్రం ఆరు బంతులు ఎదుర్కొని డక్ అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా విజయం పై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. టీమిండియాలో అసలు సిసలు మొనగాడు విరాట్ కోహ్లీ ఒక్కడేనని ప్రశంసించాడు. అతడు ఒక్కడు లేకపోతే టీమిండియా ఘోరంగా ప్రతి మ్యాచ్ ఓడిపోతుందని హెచ్చరించాడు. న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో టాప్ ఆర్డర్ మొత్తం చేతులు తీసిన విరాట్ కోహ్లీ ఒక్కడు గెలిపించాడని కొనియాడాడు. అతడే లేకపోతే తొలి వన్డేలో కూడా టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయేదని వ్యాఖ్యానించాడు.
న్యూజిలాండ్తో జరిగిన ఆక్లాండ్ వన్డే మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. అయితే దీనిపై తన్వీర్ అహ్మద్ తన స్టైల్ లో సెటైర్లు పేల్చాడు. రోహిత్ శర్మ ముద్దపప్పు లాగా మారాడని మండిపడ్డాడు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం అప్పట్లో బరువు తగ్గినట్టు రోహిత్ శర్మ సినిమా యాక్టర్ తరహాలో డ్రామాలు చేశాడని ఆరోపించాడు. దీంతో టీం ఇండియాలోకి వచ్చేసాడని… ఇప్పుడు మళ్లీ రోహిత్ శర్మ విపరీతంగా బరువు పెరిగిపోయాడని బాంబు పేల్చాడు. అలాంటి వాణ్ని నమ్ముకుంటే టీమిండియా అలాగే బీసీసీఐ రోడ్డున పడడం గ్యారెంటీ అని హెచ్చరించాడు. రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ గిల్ బ్రహ్మాండంగా ఆడుతున్నారని ప్రశంసించాడు.
ఆక్లాండ్ వేదికగా టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ విమర్శలు చేశాడు. ఆ మ్యాచ్ లో వర్షం పడకపోయి ఉంటే కచ్చితంగా న్యూజిలాండ్ విజయం సాధించేదని బాంబు పేల్చాడు. వర్షం పడడంతో టీమిండియా బతికి బయటపడి విజయం సాధించినట్టు పేర్కొన్నాడు. అదే వర్షం పడకపోతే టీమిండియా వందలోపు ఆల్ అవుట్ అయ్యేదని పరువు తీసాడు. దీంతో ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.