E-Paper
Advertisement

రైల్లో మీ వస్తువులు లేదా లగేజీ మర్చిపోతే ఏం చేయాలి? తిరిగి పొందడానికి వెంటనే ఇలా చేయండి

రైల్లో మీ వస్తువులు లేదా లగేజీ మర్చిపోతే ఏం చేయాలి? తిరిగి పొందడానికి వెంటనే ఇలా చేయండి
Advertisement

Lost Luggage On Train Journey| రైలు ప్రయాణం ముగించుకుని స్టేషన్‌లో దిగిన తర్వాత మీరు బ్యాగ్ మర్చిపోయారని తెలిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. బ్యాగ్‌లో ల్యాప్‌టాప్, మొబైల్ లేదా విలువైన వస్తువులు ఉంటే ఆందోళన మరింత పెరుగుతుంది. అయితే అలాంటి సమయంలో కంగారు పడకుండా వెంటనే సరైన చర్యలు తీసుకోవాలి. భారతీయ రైల్వే ప్రయాణికులు మర్చిపోయిన వస్తువులను తిరిగి పొందేందుకు కొన్ని ఏర్పాట్లు చేసింది. అవేంటో తెలుసుకుందాం.

వెంటనే రైల్వే అధికారులకు తెలపండి

రైలు దిగిన తర్వాత మీ వస్తువు బోగీలోనే ఉండిపోయిందని గుర్తిస్తే ఆలస్యం చేయకండి. వెంటనే స్టేషన్ మాస్టర్‌ను కలిసి విషయం చెప్పండి.
అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేయండి. మీరు ప్రయాణించిన రైలు నంబర్, కోచ్, సీటు లేదా బెర్త్ వివరాలు చెప్పండి. ఏ వస్తువు మర్చిపోయారో కూడా స్పష్టంగా వివరించండి.
వీలైతే రైలులోని అటెండెంట్ లేదా టీటీఈని కూడా సంప్రదించండి. వారికి వెంటనే సమాచారం అందితే మీ వస్తువును గుర్తించి భద్రపరిచే అవకాశం ఉంటుంది.

పోయిన వస్తువు వెతిపెట్టేందుకు మిషన్ అమానత్

Advertisement

ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులు తిరిగి అందించేందుకు రైల్వే శాఖ ‘మిషన్ అమానత్’ అనే సర్వీస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సిబ్బందికి దొరికిన వస్తువుల ఫొటోలు తీస్తారు. వాటిని సంబంధిత ప్రాంతీయ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తారు.
మీరు ఆ వెబ్‌సైట్‌లోని మిషన్ అమానత్ విభాగాన్ని సందర్శించండి. అక్కడ మీ రైలు వివరాలు, ప్రయాణించిన తేదీని నమోదు చేసి ఫొటోలను పరిశీలించండి. అందులో మీ వస్తువు కనిపిస్తే సంబంధిత రైల్వే స్టేషన్ లేదా ఆర్పీఎఫ్ పోలీస్ పోస్ట్‌ను సంప్రదించండి. వస్తువును తిరిగి పొందే విధానం గురించి అధికారులు వివరాలు అందిస్తారు.

పోయిన వస్తువు తిరిగి పొందేందుకు ఈ వివరాలు తప్పనిసరి

మీ వస్తువు దొరికిందని తెలిసిన తర్వాత కొన్ని ధ్రువీకరణ చర్యలు పూర్తి చేయాలి. ముందుగా ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) స్టేషన్‌కు వెళ్లి వస్తువు పోయినట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.
వస్తువు తీసుకోవడానికి వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు, అదే ప్రయాణానికి సంబంధించిన రైలు టికెట్ వెంట తీసుకెళ్లండి. ఆర్పీఎఫ్ అధికారులు మీ వస్తువు గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు.
ఉదాహరణకు బ్యాగ్ రంగు, అందులో ఉన్న వస్తువులు వంటి వివరాలు తెలుసుకుంటారు. ఆ వస్తువు మీదేనని నిర్ధారించుకోవడానికే ఈ ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి సరైన వివరాలు అందించండి.

ప్రయాణంలో లగేజీ మర్చిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Advertisement

మీ స్టేషన్ రావడానికి 15 నుంచి 20 నిమిషాల ముందే అలారం పెట్టుకోండి. బ్యాగ్‌కు పేరు, ఫోన్ నంబర్ ఉన్న ట్యాగ్ తగిలించండి. రైలు దిగే ముందు సీటు కింద, లగేజీ ర్యాక్‌లో వస్తువులు ఉన్నాయేమో చూడండి. మీ బెర్త్‌పై ఏ వస్తువులైనా మిగిలిపోయాయేమో మరోసారి పరిశీలించండి.

Also Read: మా దేశానికి రండి మా పౌరులను ప్రేమించండి.. లవ్ చేయాలనుకునేవారికి ఉచిత ఫారిన్ ట్రిప్..

కంగారు పడకుండా వెంటనే స్పందించండి

రైల్లో వస్తువులు మర్చిపోవడం ఎవరికైనా జరగవచ్చు. అయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడం, అవసరమైన వివరాలు అందించడం ముఖ్యం. మిషన్ అమానత్ సేవను కూడా ఉపయోగించుకోండి. ముఖ్యంగా రైలు దిగే ముందు మీ లగేజీని ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు.

Also Read: ఉద్యోగులకు కొత్త కంపెనీ బంపర్ ఆఫర్.. ఏ టైమ్‌లోనైనా పనిచేయండి, ఇష్టమొచ్చినప్పుడు సెలవులు

Related News

రైలు టికెట్ రంధ్రాల వెనుక ఇంత కథ ఉందా? చాలామందికి తెలియని ఆసక్తికర నిజం!

తనకు ఎవరూలేరని బాధపడిన వరుడు.. పెళ్లికి 10 వేల మంది అతిథులు సర్‌ప్రైజ్!

రైళ్లలో స్లీపర్ కోచ్ ప్రయాణికులకు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు!

ఈశాన్య భారతానికి బుల్లెట్ రైలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

భారత్-పాక్ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. పలు రైళ్లు రద్దు!

జస్ట్ 100 మీటర్ల లింక్ రోడ్డు కోసం.. రోడ్డెక్కిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే!

ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?

Big Stories

Advertisement
×