Balakrishna Dada:నందమూరి బాలయ్య మరోసారి అభిమానులకి సర్ప్రైజ్ ఇచ్చేందుకు అయిపోయాడు.అవును..వరుస విజయాలతో పూరకమైన జోష్‌లో ఉన్న బాలయ్య, ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించడంతో అంచనాలు ఒక్కసారిగా ఆకాశానికి తాకేశాయి.ముఖ్యంగా పవర్‌ఫుల్ యాక్షన్, స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బాలయ్య ఫాన్స్.
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్న సంగతి తెల్సిందే.అయితే ఈ మధ్య బాలకృష్ణకు గాయం కావడం వల్ల షూటింగ్‌కు కొంత గ్యాప్ రావడంతో సినిమా రిలీజ్ డేట్ డిలే అవుతుందని ,అనుకున్న సమయానికి సినిమా రాకపోవచ్చని వార్తలు ఇబ్బడి ముబ్బడిగా షికారు చేశాయి.
దీంతో అసలు సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ అటు బాలయ్య అభిమానులతో పాటు ఇటు మూవీ లవర్స్ కూడా క్యూరియస్ గా ఆరాలు తీసే పనిలో పడ్డారు. దీంతో సినిమా విడుదలపై వస్తున్న పుకార్లకు మేకర్స్ ఒక్కసారిగా చెక్ పెట్టారు. తాము ముందే చెప్పినట్టుగా సినిమాని రిలీజ్ చేస్తామని కుండ బద్దలు కొట్టేశారు.. దీంతో ఈ ఏడాది క్రిస్మస్ కి బాలయ్య ఊర మాస్ జాతర జరగబోతుంది అంటూ ఇప్పటి నుండే కాలర్ ఎగరేస్తున్నారు బాలయ్య ఫాన్స్.
ఇక డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా సినిమాను ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేయడంతో కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు మూవీ లవర్స్.సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు మాస్, బి, సి సెంటర్ల ప్రేక్షకుల్లో ఉండే విపరీతమైన క్రేజ్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆయన నోటి నుండి వచ్చే డైలాగులు, స్క్రీన్ ప్రెజెన్స్, అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయనడం లో సందేహం లేదు.
ఇక ఈ సినిమా నుంచి పాటలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పేశారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ ను అతి త్వరలోనే గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లుయూనిట్ నుంచి టాక్ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలయ్య సినిమాలకు మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ప్లస్ అవుతాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి నందమూరి తమన్ మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
గతంలో బాలకృష్ణ, తమన్ కాంబోలో వచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను ఎలా ఊపేశాయో చెప్పక్కర్లేదు. కాబట్టి ‘దాదా’ సినిమాలో కూడా తమన్ మాస్ మ్యూజిక్‌తో రచ్చ చేస్తాడని ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.మరి సినిమాలో బాలయ్య గ్యాంగ్‌స్టర్ అవతార్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది ?బాక్సాఫీస్ వద్ద నందమూరి తమన్ మ్యాజిక్ ఎలా పేలబోతోంది? అనే విషయాలు తెలియాలంటే డిసెంబర్ 24 వరకు ఆగాల్సిందే.
December 24th 🎯🎯🎯
First Single Dropping very very soon ⏳⏳⏳
As Promised, This time it’s CHRIST-MASS 💥💥💥#DADA pic.twitter.com/lyBOUanVf9
— DADA (@NBKisDADA) November 4, 2026