Puri Jagannadh : టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh) టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నారో అందరికీ తెలిసిందే. విభిన్నమైన కథతో హీరోలను పూర్తిగా తన సినిమాలలో విలన్లను చేస్తూ ఈయన తెరకెక్కించే సినిమాలు మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న హీరోలే అని చెప్పాలి. ఇలా ప్రతి ఒక్కరికి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ ఉన్నారు.
ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం…
ఇటీవల ఈయన చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో హీరోలు కూడా పూరి జగన్నాథ్ తో సినిమాలు చేయటానికి వెనకడుగు వేస్తున్నారు. ఇక చివరిగా పూరి రామ్ హీరోగా డబల్ ఇస్మార్ట్(Double Ismart) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కు ఊహించని విధంగా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
సీనియర్ నటి టబు…
ఇక ఈ సినిమా షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభంకాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ టబు(Tabu) ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి మరొక వార్త బయటకు వచ్చింది.
భవతీ భిక్షాందేహి…
ఈ సినిమాకు ఇప్పటివరకు బెగ్గర్ (Begger)అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలిసిందే అయితే, తాజాగా మరొక టైటిల్ కూడా వినబడుతుంది. ఈ సినిమాకు బెగ్గర్ కాకుండా భవతీ భిక్షాందేహి(Bhavathi Bikshandehi) అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. అయితే త్వరలోనే ఈ సినిమా టైటిల్ కి సంబంధించి అధికారక ప్రకటన వెలబడునుంది. ఇక ఈ సినిమా సరికొత్త జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ కు విజయ్ సేతుపతి అవకాశం ఇచ్చారు. మరి ఈ సినిమాతో పూరి తన మార్క్ ఏంటో చూపిస్తూ హిట్ అందుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా గురించి విజయ్ సేతుపతి గతంలో మాట్లాడుతూ పూరి చెప్పిన స్టోరీ తనకు అద్భుతంగా అనిపించడంతో వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పానని కచ్చితంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని విజయ్ సేతుపతి తెలియజేశారు.
విజయ్ సేతుపతి – పూరి జగన్నాధ్ కాంబోలో సినిమా కోసం ‘బెగ్గర్’ అనే టైటిల్ అనుకున్నారు..
ఇప్పుడు
‘భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు
ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం#purijagannadh #Vijaysethupathi pic.twitter.com/dpA3qmP6ix
— Telugu360 (@Telugu360) June 7, 2025