Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న మొన్నటి వరకు లక్షకు చేరువలో ఉన్న బంగారం ధరలు.. ఈరోజు(జూన్ 7th) న భారీగా దిగొచ్చాయి. 22 క్యారెట్ల తులం బంగారానికి ఏకంగా రూ.1500 తగ్గింది. దీంతో 89,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారానికి రూ.1630 తగ్గి.. రూ.97,970 వద్ద కొనసాగుతోంది.
గ్లోబల్ మార్కెట్ ప్రభావం
బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉండటంతో.. డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో బంగారంపై పెట్టుబడి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.
చైనాలో డిమాండ్ మందగమనము:
ప్రపంచంలో బంగారానికి పెద్ద మార్కెట్లలో ఒకటైన చైనాలో.. డిమాండ్ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. అంతే కాక, వారి ఆర్థిక పునరుద్ధరణ ఆశించిన స్థాయిలో జరగకపోవడం కూడా ప్రభావం చూపింది.
పెట్టుబడిదారుల దృష్టి స్టాక్ మార్కెట్లపై:
ఇటీవల భారత స్టాక్ మార్కెట్లు మంచి లాభాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారంపై కన్ను తగ్గించి, షేర్లవైపు మొగ్గుచూపుతున్నారు.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,800 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,970 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,800 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,970 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,800 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,970 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.98,120 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,950 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,970 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,800 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,970 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాత్రం తగ్గుముఖం పడుతుంటే.. వెండి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,18,000 కి చేరుకుంది.
Also Read: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ.. ముచ్చటగా మూడోసారి, చౌకగా గృహ రుణాలు
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,07, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.