Shobhan Babu: మన తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో దివంగత నటుడు శోభన్ బాబు(Shobhan Babu) గారు ఒకరు. ఎన్టీఆర్ ,ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలు కొనసాగుతున్న సమయంలోనే శోభన్ బాబు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్న శోభన్ బాబు తన సినిమాల ద్వారా ఎంతో మంది మహిళా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఏ హీరోలకి లేని లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ శోభన్ బాబు గారికి అప్పట్లో ఉండేది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప సినిమాలలో నటించిన ఈయన చివరి రోజుల్లో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
ఇక శోభన్ బాబు తర్వాత ఇండస్ట్రీలోకి ఆయన వారసులు ఎవరు కూడా ఎంట్రీ ఇవ్వలేదు. ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారడం కానీ శోభన్ బాబు మాత్రం తన పిల్లల్ని ఎవరిని కూడా ఇండస్ట్రీ వైపుకు పంపించకుండా వారిని ఇతర రంగాలలో స్థిరపడేలా చేశారు. ఇక ఇటీవల కాలంలో శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ (Surakshith)వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ప్రముఖ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ గా
సురక్షిత పనిచేస్తున్నారు అయితే తన ఇంట్లో తన తల్లిదండ్రులతో పాటు భార్య కూడా డాక్టర్ కావడంతో వీరంతా ఒక సొంత హాస్పిటల్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాతయ్య సెంటిమెంట్…
ఇక ఇటీవల కాలంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న డాక్టర్ సురక్షిత్ తాజాగా తన తాతయ్య శోభన్ బాబు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన భార్య పిల్లల గురించి తెలిపారు. తనకు ఇద్దరు పిల్లలని, వారిలో పెద్దమ్మాయి 10 సంవత్సరాలు, చిన్నమ్మాయికి 4 సంవత్సరాలని తెలిపారు. ఇక వీరి పేర్లు చెబుతూ పెద్దమ్మాయి పేరు సన్విక్ష, చిన్నమ్మాయి పేరు సమన్వి అని తెలియజేశారు. ఇలా వీరిద్దరి పేర్లు ”S” తో మొదలవడంతో ఎందుకలా పెట్టారనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సురక్షిత్ సమాధానం చెబుతూ..S అనే లెటర్ తాతగారికి సెంటిమెంట్ అంటూ చెప్పుకు వచ్చారు.
S లెటర్ తోనే పేర్లు…
నా పేరు మాత్రమే కాకుండా మా కజిన్స్ పేర్లన్నీ కూడా మొదటి లెటర్ S తోనే ప్రారంభం అవుతాయని సురక్షిత్ తెలియజేశారు. ఇక తాత గారికి ఈ సెంటిమెంట్ ఉండటంతో తన పిల్లలకు కూడా అదే విధంగా పేర్లు పెట్టినట్టు ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇక శోభన్ బాబు గారు పెద్ద నటుడు కానీ మీరు ఎందుకని ఇండస్ట్రీలోకి రాలేదని ప్రశ్న ఈయనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు సురక్షిత్ సమాధానం చెబుతూ.. చిన్నప్పటినుంచి మేము తాతగారు ఎంత కష్టపడ్డారో చూసేవాళ్ళం అందుకే తాతగారు మమ్మల్ని ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదని తెలిపారు.
ప్రభాస్ ఫేవరెట్ హీరో…
తాతగారు ఎక్కువగా ఫ్యామిలీతోనే సమయం గడపడానికి ఇష్టపడేవారు. వీకెండ్ అయితే కచ్చితంగా అందరం ఆయన చుట్టూ ఉండాల్సిందేనని, మాతో పాటు కూర్చుని ఎన్నో మంచి మంచి విషయాలను మాకు చెబుతూ ఉండేవారని తెలిపారు. ఇక తెలుగు సినిమాల గురించి ప్రస్తావన రావడంతో నేను తెలుగులో ఎక్కువగా సినిమాలు చూడనని కాకపోతే నాకు ప్రభాస్(Prabhas) అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆయన నటించిన బాహుబలి(Bahubali) సినిమా చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా సురక్షిత్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.