BigTV English

Kanye West: మాజీ భార్యపై రివెంజ్.. రెండో భార్యను నగ్నంగా మార్చి.. రూ. 175 కోట్లు నష్టం

Kanye West: మాజీ భార్యపై రివెంజ్.. రెండో భార్యను నగ్నంగా మార్చి.. రూ. 175 కోట్లు నష్టం

Kanye West: ఏదో అనుకుంటే  ఇంకేదో జరిగిందే అన్నట్లు.. మాజీ భార్యపై రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు. దాని కోసం ఏదో చేద్దామనుకుంటే చివరకు రూ. 175 కోట్లు నష్టపోయాడు. అతను ఎవరో కాదు.. అమెరికన్ ర్యాపర్, రికార్డ్ ప్రొడ్యూసర్  కెన్యే వెస్ట్. ఎన్నో  ర్యాప్ సాంగ్స్ తో ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన కెన్యే వెస్ట్..  హాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ కర్దాషియన్ ను పెళ్ళాడి మరింత  పాపులర్ అయ్యాడు. 2014 లో వీరి వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇక పెళ్లి అయిన కొన్నేళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట  ఆ తరువాత విభేధాల వలన  2022 లో విడిపోయారు.


ఇక విడాకుల తరువాత కిమ్ కర్ధాషియాన్ సింగిల్ గా నివసిస్తుంది. గతేడాది అంబానీ పెళ్లిలో కిమ్ స్పెషల్ గెస్ట్ గా మెరిసిన విషయం తెల్సిందే.  ఇక కిమ్ తో విడాకుల తరువాత కెన్యే వెస్ట్,  బియాంకా సెన్సోరి అనే మోడల్ ను వివాహమాడాడు. కిమ్ తో విడాకుల తరువాత కూడా కెన్యే వెస్ట్ ఆమెను వదలడం లేదు. చాలా సంవత్సరాలుగా, కాన్యే తరచుగా కిమ్‌ను రెచ్చగొట్టేలా చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు, ఇది అతను తన విడాకుల నుండి ముందుకు సాగలేకపోతున్నాడని చూపిస్తుంది. కాన్యే తన ప్రణాళిక ప్రకారం  కిమ్ లాగే కనిపించే మహిళలతో డేటింగ్ చేయడం, ఆమె బ్రాండ్‌లకు వ్యతిరేకంగా పోటీ పడగల ప్రాజెక్టులను ప్రారంభించడం చేస్తున్నాడు.

ఈసారి కూడా మాజీ భార్యపైన ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు. 2025 గ్రామీ అవార్డులకు కెన్యే వెస్ట్, తన భార్య బియాంకాకు ఇన్విజిబుల్ డ్రెస్ వేయించి తీసుకొచ్చాడు. ఈ వేడుకలో బియాంకా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.  పూర్తి నగ్నంగా కనిపించి బియాంకా కొత్త వివాదానికి తెరలేపింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది దీనిని బోల్డ్ ఫ్యాషన్ ఎంపికగా భావించినప్పటికీ, మరికొందరు మాత్రం కిమ్ ను రెచ్చగొట్టడానికి  కెన్యే ఇలా చేసాడని చెప్పుకొస్తున్నారు.


VishwakSen: #బాయికాట్ లైలా.. పృథ్వీ మాటలపై స్పందించిన హీరో విశ్వక్ సేన్..!

అయితే బియాంకాను బెదిరించి కెన్యే ఈ పని చేసి ఉంటాడని కొందరు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం అతను పెట్టిన పోస్ట్. ” నా భార్యపై నాకు ఆధిపత్యం ఉంది. ఇది మేల్కొన్న స్త్రీవాదం కాదు. రెడ్ కార్పెట్ లుక్ ఆమె నిర్ణయం అని ప్రజలు అంటున్నారు… ఆమె కోరుకోనిది నేను చేయను, కానీ నా ఆమోదం లేకుండా ఆమె ఖచ్చితంగా అలా చేయగలిగేది కాదు” అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఇది పూర్తిగా కెన్యేనే చేశాడని అంటున్నారు.

ఇక ఈలోపే బియాంకా మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇలా నగ్నంగా రావడం నా అంగీకారంతోనే జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ  ఇన్విజిబుల్ డ్రెస్  తయారుచేసే దగ్గరనుంచి రిహార్సల్స్ చేసేవరకు ఒక మేకింగ్ వీడియోలా తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో బియాంకా ఇష్టప్రకారమే ఇది జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ డ్రెస్ వివాదం.. కెన్యేకు కోట్లల్లో నష్టాన్ని తీసుకొచ్చింది.

మే నెలలో టోక్యో డోమ్‌లో రెండు ప్రదర్శనలు కెన్యే రెండు ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంది. ఆ రెండు షోస్ విలువ అక్షరాలా 20 మిలియన్ డాలర్లు అంటే రూపాయల్లో 175 కోట్లు. భార్యను నగ్నంగా గ్రామీ అవార్డులకు తీసుకెళ్లిన కారణంగా ఆ రెండు షోస్ ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త  సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాజీ భార్యపై రివెంజ్ అక్షరాలా 175 కోట్లు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×