BigTV English
Advertisement

VishwakSen: #బాయికాట్ లైలా.. పృథ్వీ మాటలపై స్పందించిన హీరో విశ్వక్ సేన్..!

VishwakSen: #బాయికాట్ లైలా.. పృథ్వీ మాటలపై స్పందించిన హీరో విశ్వక్ సేన్..!

VishwakSen:ప్రస్తుతం యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) తాజాగా నటిస్తున్న చిత్రం ‘లైలా’. మాస్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన తొలిసారి ఇందులో లేడీ పాత్రలో నటించబోతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఆదివారము రోజు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil ravipudi) తో పాటూ చిత్ర యంగ్ నిర్మాత సాహు గారపాటి (Sahoo garapati) గెస్ట్లుగా వచ్చారు. ఇకపోతే ఇదే ఈవెంట్లో ప్రముఖ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ(Prithvi ) చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఫైర్ అయిన వైసీపీ నాయకులు, అభిమానులు, అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు బాయ్ కాట్ లైలా అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.


గెస్ట్ గా వచ్చేవాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు కదా – సాహు

సోషల్ మీడియాలో లైలా మూవీని బాయ్ కాట్ చేయాలి అంటూ వైరల్ చేస్తున్న నేపథ్యంలో.. లైలా చిత్ర హీరో విశ్వక్ సేన్ కష్టపడి సినిమాను చేసాము. దయచేసి మా చిత్రం పై నెగిటివ్ కామెంట్స్ రుద్దకండి అంటూ వేడుకున్నారు. ఈ నేపథ్యంలోనే పృథ్వీ చేసిన కామెంట్స్ పై లైలా నిర్మాత సాహూ గారపాటి మాట్లాడుతూ..” బాయికాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాము. అది మా నోటీసులో జరగలేదు. సినిమాని అందరూ కేవలం సినిమాగా మాత్రమే చూడాలి. గెస్ట్ గా వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు” అంటూ తెలిపారు.


మా సినిమాని బలి చేయొద్దు-విశ్వక్ సేన్..

అలాగే హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ” మా ఈవెంట్ లో జరిగిన దానికి మేము క్షమాపణలు చెబుతున్నాము. సినిమాలో ఎవరో ఒకరు తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా తప్పు చేసినట్టేనా.. పృథ్వీ మాట్లాడిన మాటల గురించి మాకు తెలియదు. ఆయన మాట్లాడిన మాటలకు, మా సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ అంటే ఎలా.. సినిమా బ్రతకాలా? వద్దా..? మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడాడు. అది మా కంట్రోల్లో జరగలేదు. సినిమాను చాలా కష్టపడి తీసాము. నేను ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నాను. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు. మా సినిమాను బాయ్కాట్ అంటూ వైరల్ చేయొద్దు” అంటూ విశ్వక్ సేన్ వేడుకున్నారు. ప్రస్తుతం విశ్వక్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పృథ్వీ ఏమన్నారంటే..?

లైలా సినిమాలో ఒక సన్నివేశం గురించి మాట్లాడుతూ.. ఇందులో మేకల సత్తిగా నేను చేశాను. మేకలు ఎన్ని ఉన్నాయని షార్ట్ మధ్యలో అడిగితే 150 ఉన్నాయని చెప్పారు. యాదృచ్ఛికమో ఏమో కానీ సినిమా చివర్లో లెక్కిస్తే కరెక్ట్ గా 11 గొర్రెలే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాల్లో బ్రహ్మాండంగా పెట్టారు అంటూ పృథ్వీ కామెంట్లు చేశారు. దీంతో రాజకీయ చిచ్చు రగిలించినట్టయింది.అసలు విషయంలోకి వెళ్తే 2024 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో.. అంతకుముందు 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ, గత ఏడాది కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక వైసీపీని టార్గెట్ చేసి పృథ్వీ కామెంట్లు చేశారని, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసిపి పార్టీలో ఉన్న పృథ్వీ ఇప్పుడు జనసేనలోకి వచ్చి వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×