E-Paper
Advertisement

Jobs in Indian Railways: రైల్వేలో 32,438 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఛాన్స్..

Jobs in Indian Railways: రైల్వేలో 32,438 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఛాన్స్..

Jobs in Indian Railways: ఎన్నో రోజుల నుంచి రైల్యే పరీక్షలకు సన్నద్దమవుతున్నారా..? ఇప్పుడు ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త. ఎన్నో రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న గ్రూప్-డి నోటిఫికేషన్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 32000 వేల గ్రూప్-డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలుబడింది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తుకు ఇంకా 12 రోజుల సమయం మాత్రమే ఉంది.

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గ్రూప్‌–డి పోస్టుల భర్తీకి నోటిఫికేష్ వచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 23 నుంచి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి అవకాశం రావడానికి మళ్లీ చాలా సమయం పడొచ్చు.. కనుక ఈ సారే జాబ్ కి అప్లై చేసుకొని కాస్త కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 32,438

నోట్: మన సికింద్రాబాద్ జోన్ లో 1642 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పాయింట్స్ మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకోషెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకన్సీ ఉన్నాయి.

విద్యార్హత: టెన్త్ క్లాస్, సంబంధిత విభాగంలో ఐటీఐ పాసై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కల్గి ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 23

దరఖాస్తు ముగింపు తేది: 2025 ఫిబ్రవరి 22

నోటిఫికేషన్ కు సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్: https://indianrailways.gov.in

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మన సికింద్రాబాద్ జోన్‌లో 1642 ఉద్యోగాలున్నాయి.

ముఖ్యమైనవి:

దరఖాస్తు ప్రారంభ తేది: జనవరి 23

దరఖాస్తుకు ముగింపు తేది: ఫిబ్రవరి 22

దేశ వ్యాప్తంగా మొత్తం ఉద్యోగాలు: 32,438

వయస్సు: 18 నుంచి 36  ఏళ్ల మధ్య ఉండాలి.

Also Read: Local Bank Officer Jobs: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. జస్ట్ డిగ్రీ పాసైతే చాలు..!!

ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి నుంచి ప్రణాళిక ప్రకారం చదువుకుంటే గ్రూప్-డి ఉద్యోగాన్ని ఈజీగా సాధించవచ్చు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలు బాగ రాయలేని వారికి ఇది గోల్డెన్ అపార్చునిటీగా చెప్పవచ్చు. మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి. సో ఇప్పుడే ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుండి. ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టండి.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×