BigTV English
Advertisement

Big TV Exclusive: దీపావళి బరి నుండి తప్పుకున్న అల్లరి నరేష్.. ఆ భయం చుట్టుకుందా..?

Big TV Exclusive: దీపావళి బరి నుండి తప్పుకున్న అల్లరి నరేష్.. ఆ భయం చుట్టుకుందా..?

Big TV Exclusive.. 2023 డిసెంబర్ 2వ తేదీన పూజా కార్యక్రమాలతో చాలా ఘనంగా లాంచ్ అయ్యింది అల్లరి నరేష్ బచ్చలమల్లి (Bacchalamalli) మూవీ. అల్లరి నరేష్ హీరోగా సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజ వరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించిన హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ, బాలాజీ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూలై 16వ తేదీన మా ఊరి జాతరలో అనే మొదటి పాటను విడుదల చేసి మంచి పాపులారిటీ దక్కించుకున్నారు.


సరికొత్త పాత్రలో అల్లరి నరేష్..

ఇకపోతే ఈ సినిమాలో నరేష్ ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని సమాచారం. అంతేకాదు అల్లరి నరేష్ ని డైరెక్టర్ సుబ్బు కూడా మనుపెన్నడూ చూడని అవతార్ లో ప్రజెంట్ చేయబోతున్నారట. అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈమెతో పాటు ఈ చిత్రంలో రోహిణి, అచ్యుత్ కుమార్, రావు రమేష్, బలగం జయరాం, ప్రవీణ్ ,హరితేజ, వైవా హర్ష తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. మట్టి కుస్తీ , మానాడు, రంగం వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ డీఓపీ గా పనిచేస్తుండగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్ గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఇకపోతే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ తేదీ నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


దీపావళి నుంచి తప్పుకున్న అల్లరి నరేష్..

దీపావళి సందర్భంగా సినిమా రాబోతుందని అల్లరి నరేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అంతే కాదు ఎన్నడూ చూడని క్యారెక్టర్ అనడంతో ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ సినిమా దీపావళి బరి నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది హీరోలు ఈ డేట్ ను ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో అన్ని సినిమాల మధ్య తమ సినిమా హిట్ అవుతుందా అనే అపనమ్మకమే ఆయనను డేట్ మార్చుకునేలా చేసిందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ విడుదల తేదీని వాయిదా వేశారు.

బచ్చలపల్లి విడుదల తేదీ ఖరారు..

నవంబర్ 22వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోందని మేకర్స్ ఫిక్సయినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. ఏది ఏమైనా దీపావళి బరి నుంచి అల్లరి నరేష్ తప్పుకోవడం అభిమానులకు కాస్త నిరాశ మిగులుస్తోందని చెప్పవచ్చు. ఇక నవంబర్ 22వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. మొత్తానికైతే హీరోగా భారీ సక్సెస్ అవ్వాలనుకుంటున్న నరేష్ కి ఈ సినిమా తొలిమెట్టు కావాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక అల్లరి నరేష్ కి సక్సెస్ లభిస్తుందా లేదా తెలియాలి అంటే నవంబర్ 22 వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×