Big TV Exclusive:#చిరు 157.. అనిల్ రావిపూడి(Anil Ravipudi), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టిన అనిల్ రావిపూడి.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ వదులుతాడా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఒక ఎక్స్ క్లూజివ్ న్యూస్ బిగ్ టీవీ ద్వారా బయటకు వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే స్పెషల్ బీట్ పై కూడా ఫోకస్ చేశారట.
మొత్తం 5 పాటలు.. అందులో..
ఇకపోతే ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని, అందులో నాలుగు పాటలు, ఒకటి స్పెషల్ బీట్ ఉండనుంది అని సమాచారం. అంతేకాదు చిరంజీవితో ఈ స్పెషల్ బీట్ చేయడానికి ఎవరు ఊహించని బ్యూటీని అనిల్ రావిపూడి రంగంలోకి దింపుతున్నారట. మరి మొత్తానికైతే భారీగా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
చిరు సరసన మరోసారి..
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి చిరు సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు? అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చినా.. దీనిపై చిత్ర బృందం స్పందించలేదు. మరోవైపు ఈ ప్రాజెక్టులో నయనతార (Nayanthara) మరొకసారి చిరంజీవితో కలిసి నటించబోతోంది అని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా కోసం ఆమె భారీగా పారితోషకం డిమాండ్ చేసిందని, అందుకే ఆమెను తప్పించారు అంటూ కూడా వార్తలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి తీసుకువచ్చారు. అయినా సరే సందిగ్ధత వీడకపోయేసరికి అభిమానులు చిరంజీవికి జోడీగా ఎవరు నటించబోతున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు చిత్ర బృందం హీరోయిన్ ను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా కనిపించనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు కంప్లీట్ తెలుగులో ఒక సూపర్ ఫన్ వీడియోని ఆమెపై చేసి రిలీజ్ చేశారు. తమ అవైటెడ్ ప్రాజెక్టు లోకి ఆహ్వానం పలికారు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తూ ఉండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఇకపోతే గతంలో చిరంజీవి, నయనతార కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి జోడీకి తెలుగులో మంచి క్రేజ్ కూడా ఉంది. అందుకే ఇప్పుడు మరొకసారి వీరిద్దరూ స్క్రీన్ పై సందడి చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే నయనతార, చిరంజీవి సరసన హీరోయిన్ గానే కాకుండా చెల్లిగా కూడా నటించింది. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరు చెల్లిగా నటించిన ఈమె ఇప్పుడు ఆయన సరసన జోడీగా చేయబోతోంది.
ALSO READ:Big TV Exclusive: చిరు – అనిల్ మూవీలో వెంకీ మామ.. ఆ 15 నిమిషాలు అంతకుమించి..!