Big TV Exclusive: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 7 పదుల వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారారు. అటు యంగ్ డైరెక్టర్ లను టార్గెట్ గా చేసుకొని వారికే అవకాశాలు ఇస్తున్న చిరంజీవి.. ప్రస్తుతం వశిష్ట మల్లిడి (Mallidi Vassishta) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను జూన్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరొకవైపు ఈ ఏడాది వెంకటేష్ (Venkatesh)తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రముఖ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో చిరంజీవి సినిమా చేస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్ లోనే ప్రకటించిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
చిరు – అనిల్ మూవీలో వెంకీ మామ.. అది మాత్రం ప్రత్యేకం..
అయితే ఇప్పుడు తాజాగా బిగ్ టీవీకి అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో వెంకీమామ కూడా భాగం కాబోతున్నట్లు సమాచారం. అసలే అనిల్ రావిపూడి – వెంకటేష్ మధ్య మంచి ర్యాపో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయనతో మరోసారి కామెడీ చేయడానికి సిద్ధమయ్యారు అనిల్ రావిపూడి. అందులో భాగంగానే #చిరు 157 (#Chiru 157) సినిమా ప్రీ క్లైమాక్స్ లో చిరంజీవి – వెంకటేష్ మధ్య సన్నివేశాలు ఉంటాయని, 15 నిమిషాల పాటు సాగే సన్నివేశం సినిమాకే చాలా హైలెట్ గా నిలవనుంది అని సమాచారం. అంతేకాదండో వెంకటేష్ – చిరంజీవి కాంబినేషన్ లో ఒక సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.ఇక ఊహించుకుంటేనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. ఇక ఇద్దరు బడా స్టార్ హీరోలను ఒకే తెరపై .. అందులోనూ ఒకే సాంగ్ లో చూస్తే ఇక తట్టుకుంటామా.. అందులోనూ చిరంజీవి – వెంకీ మామ మధ్య పాట అంటే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే అనిల్ రావిపూడి బాగానే ప్లాన్ చేశారు.. మరి ఇద్దరు స్టార్ సీనియర్ హీరోలను తెరపై ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.
అనిల్ రావిపూడి సినిమాలు..
ప్రస్తుతం సీనియర్ హీరోలే టార్గెట్ గా సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి.. ఇప్పటికే బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్ తో సినిమా చేసి భారీ సక్సెస్ అందుకున్నారు, ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కామెడీని బేస్ చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గా సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ఇక నాగార్జున (Nagarjuna) తో కూడా సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే ప్రస్తుతం ప్రముఖ బుల్లితెర చానల్లో ప్రసారమవుతున్న ‘డ్రామా జూనియర్స్’ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు బుల్లితెర ఆడియన్స్ ను, ఇంకొక వైపు అద్భుతమైన కథలను తెరపైకి తీసుకొస్తూ.. ఇటు వెండితెర ఆడియన్స్ ను సైతం మెప్పిస్తూ.. చక్కగా కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అనిల్ రావిపూడి.
ALSO READ:Kesari Chapter 2 Telugu Trailer: ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?