Kedarnath: కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ అంబులెన్స్‌కు పెను ప్రమాదం తప్పింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. సాంకేతిక లోపంతో హెలికాఫ్టర్‌ను అత్యవసరం గా ల్యాండింగ్ చేశాడు పైలెట్. ల్యాండింగ్ సమయంలో వెనుక భాగం నేలను బలంగా ఢీకొట్టడంతో దెబ్బతింది. అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎయిమ్స్ నుంచి కేదార్‌నాథ్‌కు వస్తున్న ఓ హెలికాప్టర్ అంబులెన్స వస్తోంది. అయితే కేదార్‌నాథ్ హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా నియంత్రణ తప్పింది. ఆ సమయంలో హెలికాప్టర్ వెనుక భాగం నేలను బలంగా తాకింది. దీంతో వెనుక భాగం బాగానే డ్యామేజ్ అయ్యింది. హెలిప్యాడ్‌కు 20 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించడానికి భక్తులు వస్తున్నాయి. అయితే ఓ మహిళ భక్తురాలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడింది. ఈ విషయం జిల్లా అధికారుల ద్వారా ఉన్నతాధికారులకు తెలిసింది. మహిళ పరిస్థితి మరింత దిగజారింది. వెంటనే అధికారులు హెలికాప్టర్ అంబులెన్స్ సహాయం తీసుకున్నారు.
ఎయిమ్స్ నుండి ఇద్దరు సభ్యులతో కూడిన ఒక వైద్య బృందం హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌కు చేరుకుంటోంది. అందులో డాక్టర్, నర్సు ఉన్నారు. కేదార్‌నాథ్ ప్రధాన హెలిప్యాడ్‌కు 20 మీటర్ల దూరంలో హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. పరిస్థితి గమనించిన పైలట్, హెలిప్యాడ్ కు కూతవేటు దూరంలో ల్యాండ్ చేశాడు.
అదే సమయంలో హెలికాప్టర్ వెనుక భాగం నేలను బలంగా ఢీ కొట్టింది. వెనుక టెయిల్ రోటర్ విరిగిపోయింది. కాసేపటికి మెల్లగా ల్యాండ్ అయ్యింది. ఈ సన్నివేశాన్ని చూసిన స్థానికులు, పర్యాటకులు భయంతో హడలిపోయారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. జరిగిన ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు అధికారులు.
#Watch | उत्तराखंड में एक बार फिर हेलीकॉप्टर क्रैश हुआ है। केदारनाथ धाम को जा रहा हेलीकाप्टर शनिवार दोपहर को क्रैश हो गया। हालांकि, राहत की बात रही कि हेलकॉप्टर के क्रैश होने से किसी की जान नहीं गई है।#KedarnathDham #Helicopter pic.twitter.com/WKwH9SpTSX
— Hindustan (@Live_Hindustan) May 17, 2025