Shiva Jyothi: యాంకర్ శివ జ్యోతి (Shiva Jyoti).. ఈమె గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. న్యూస్ ఛానల్ యాంకర్ గా.. సావిత్రక్కగా బిత్తిరి సత్తితో చేసిన ఎన్నో వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. అలా యాంకర్ గా బాగా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమెకు.. బిగ్ బాస్ సీజన్ 3 (Bigg Boss Season 3) లో అవకాశం లభించింది. ఈ ఒక్క షో ఈమె కెరియర్ ని పూర్తిగా మార్చేసింది. పైగా సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో సందడి చేసే ఈమె.. తాజాగా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. సాధారణంగా గ్లామర్ పరంగా ఎప్పుడూ కూడా హద్దులు దాటదు శివ జ్యోతి. అలాంటిది ఇప్పుడు షేర్ చేసిన వీడియో చూస్తే మాత్రం ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది అనడంలో సందేహం లేదు.
బాత్రూం వీడియో షేర్ చేసిన శివ జ్యోతి..
చీర కట్టులో కనిపిస్తూ సాంప్రదాయంగా కనిపించే శివజ్యోతి సడన్‌గా బాత్రూం వీడియో పంచుకోవడంతో అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోని ఆమె షేర్ చేసింది. దీనితో నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు శివజ్యోతి రొమాంటిక్ బిహేవియర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ బాత్రూం వీడియోని ఆమె షేర్ చేస్తూ.. “భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా?” అనే క్యాప్షన్ కూడా జోడించింది శివ జ్యోతి. ఇకపోతే బాత్రూం లో ఒంటికి సబ్బు రుద్దుతూ.. స్నానం చేస్తూ.. చీర కట్టుకుంటూ.. భర్తతో చిలిపి వేషాలు వేస్తూ ఈ వీడియోని పంచుకుంది.
అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగమే అనే నెటిజన్లు అంటున్నా.. మరి కొంతమంది ఇలాంటి చండాలపు వీడియోలు షేర్ చేసి , సమాజానికి ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇకపోతే ఇదొక కార్పొరేట్ బ్రాండ్ కి ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘బాడీ వైస్’ అనే బాడీ వాష్ జెల్ బ్రాండ్ కి ప్రమోటర్‌గా మారింది. ఆ ప్రమోషన్ లో భాగంగానే ఇలా శివజ్యోతి బాత్రూం వీడియో షేర్ చేసిందని తెలుస్తోంది.
Also read: బాలయ్య కాళ్లపై పడిపోయిన హీరోయిన్ సంయుక్త… వీడియో వైరల్!
శివజ్యోతి పై మండిపడుతున్న నెటిజన్స్..
ఇకపోతే శివజ్యోతి ఇలా బాత్రూం వీడియో షేర్ చేయడంతో డబ్బు కోసం ప్రైవేట్ విషయాలను కూడా పబ్లిక్ చేస్తారా? ఛీ.. ఛీ.. అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి శివజ్యోతికి మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు దానిని కూడా పాడు చేసుకుంటోందని మరికొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఇలాంటి సెలబ్రిటీలు ప్రచారం చేసే ఉత్పత్తులను నమ్మకండి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి అయితే శివ జ్యోతి తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని, ఇప్పుడు ఆమెనే తన చేజేతులారా ఆ కెరియర్ ను కోల్పోతుందేమో అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుతం శివజ్యోతి కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి తనపై పెరుగుతున్న ఈ నెగిటివిటీకి శివ జ్యోతి ఎలాంటి రెస్పాండ్ అవుతుందో చూడాలి.
?utm_source=ig_web_copy_link