Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ఒరవడికి నాంది పలికాడు. ఇండస్ట్రీలో తాము చనిపోయేంతవరకు హీరోగానే చేయాలి అనుకునేవారు చాలామంది ఉన్నారు. తాము హీరో గానే కెరీర్ ని ప్రారంభించాము.. హీరోగానే కెరీర్ ను ముగించాలి అనుకునే మైండ్ సెట్ తో ఉన్న హీరోలందరికీ హీరో అక్కినేని నాగర్జున షాక్ ఇచ్చాడు. అన్ని పాత్రలు చేస్తేనే ఒక సంపూర్ణ నటుడు అనిపించుకుంటాడు అనేది నాగార్జున బాగా నమ్ముతున్నట్లు అర్థమవుతుంది. హీరోగా అన్ని పాత్రలు చేసి బోర్ కొట్టేసిన ఆయన ఎట్టకేలకు ఆ హీరో అనే బౌండరీ నుంచి బయటపడ్డాడు.
హీరో గానే కాకుండా సపోర్టు రోల్స్ లో కూడా నాగార్జున నటించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే రెండు సినిమాల్లో కింగ్ సపోర్టివ్ రోల్స్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి కుబేర అయితే రెండు కూలీ. కుబేర ఈనెల 20 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నాగార్జున ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. హీరో ధనుష్ అయిన కూడా సినిమా మొత్తం నాగార్జున పాత్రనే ఎక్కువ హైలెట్ కానుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన నాగార్జున పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఇక ఇది కాకుండా నాగ్ కీలకపాత్రలో నటిస్తున్న మరో చిత్రం కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగార్జున నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడని టాక్ నడుస్తుంది. నిజం చెప్పాలంటే కూలీ సినిమా కానీ, కుబేర సినిమా కానీ, రజనీకాంత్, ధనుష్ లాంటి హీరోలను చూసి కాకుండా నాగార్జున సపోర్టివ్ రోల్ లో కనిపిస్తున్నందుకే ప్రేక్షకులు ఎక్కువ ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే నాగార్జున ఇలా కీలకపాత్రులు చేసుకుంటూ పోవడమేనా లేక మళ్ళీ హీరోగా మారతాడా అనే ప్రశ్న గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం కింగ్ ఇకనుంచి హీరోగా చేయడంతో పాటు.. మంచి పాత్రలు వస్తే సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున 99 వ చిత్రాలను పూర్తి చేశాడు. ఇక నాగ్ 100వ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రతి నటుడి కెరీర్ లో హాఫ్ సెంచరీ, సెంచరీ సినిమాలకు ఒక సపరేట్ గుర్తింపు ఉంటుంది అని చెప్పొచ్చు. ఎట్టకేలకు నాగ్ తన కెరీర్ లో 100వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఈ సీనియర్ హీరో 100వ చిత్రం అంటే ఏ స్టార్ డైరెక్టర్ తోనో, హిట్ డైరెక్టర్ తోనో సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనుకుంటే పొరపాటే. ఈసారి కింగ్ చాలా కొత్తగా ఆలోచించి ఒక కోలీవుడ్ డైరెక్టర్ తో చేతులు కలిపినట్లు తెలుస్తుంది. అది కూడా ఒక అనుభవం లేని డైరెక్టర్ తో నాగార్జున తన 100వ చిత్రానికి పునాది వేసినట్లు టాక్. ఆకాశం అనే సినిమాతో రా కార్తీక్ అనే డైరెక్టర్ కోలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దర్శకుడిగా పెద్దగా అనుభవం లేకపోవడం వలన, టేకింగ్ విషయంగా ఈ సినిమాలో చాలా లోటుపాట్లు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అలాంటి డైరెక్టర్ తో నాగార్జున వందవ సినిమాను ప్రకటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చాలామంది దర్శకులు అక్కినేని హీరోకు కథలు వినిపించినా.. చివరకు రా కార్తీక్ కథ మాత్రమే ఆయనను మెప్పించిందని, దీంతో ఆయన ఈ సినిమాను ఫైనల్ చేసినట్లు సమాచారం. జూలైలో ఈ సినిమా పట్టాలెక్కనుదని తెలుస్తోంది. ఏది ఏమైనా నాగార్జున ఇలా అనుభవం లేని డైరెక్టర్ తో తన సెంచరీ సినిమాను ప్రకటించడం కష్టంతో కూడుకున్న పనే అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి నాగ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది. చూడాలి.