Allu Arjun Basil Joseph Movie : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్ అయింది. దీని తర్వాత మలయాళ బిసిల్ జోసెఫ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు అనే వార్త వచ్చింది. దీన్ని బాగా వైరల్ చేశారు బన్నీ ఫ్యాన్స్. మల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. అంతే కాదు… వీరి కాంబోలో వచ్చే మూవీ ‘శక్తి మాన్’ అంటూ వార్తలు వచ్చేశాయి. అల్లు అర్జున్‌ను ‘శక్తి మాన్’ గెటెప్ క్రియేట్ చేసి తెగ పండగ చేసుకున్నారు బన్నీ అభిమానులు.
కానీ, అల్లు అర్జున్ – బిసిల్ జోసెఫ్ కాంబినేషన్ లో వస్తున్న ఆ సినిమాకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శక్తిమాన్‌కు అసలు ఎలాంటి సంబంధం లేదట. ఇప్పటి వరకు వచ్చినవి అన్నీ కూడా పుకార్లే అని సమాచారం అందుతుంది. అసలు ఇదింతా ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం..
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా త్రివిక్రమ్ తో ఉండాల్సింది. కానీ, బన్నీకి అట్లీ చెప్పిన స్టోరీ బాగా నచ్చేసింది. వెంటనే ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. దీంతో త్రివిక్రమ్ తప్పుకోవాల్సి వచ్చింది. తప్పుకోవడమే కాకుండా… ఆ కథను తీసుకెళ్లి ఎన్టీఆర్ కి వినిపించాడు. ఆ కథతో ఎన్టీఆర్ చేయడానికి రెడీ అయిపోయాడు.
ఈ విషయం అంతా బయటికి వచ్చేసింది. దీంతో.. త్రివిక్రమ్‌ను పక్కన పెట్టాడు అంటూ బన్నీపై ట్రోల్స్ వచ్చాయి. హీరోపై కాస్త నెగిటివిటీ కూడా వచ్చింది. ఇదే టైంలో… బసిల్ జోసెఫ్ కథ చెప్పాడు. ఇది బయటికి రావడంతో… దీన్ని వైరల్ చేసి… బన్నీ పాన్ ఇండియా స్టార్, మల్లు అర్జున్.. మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు… అంటూ సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ హంగామా చేశారు. దానికి ఇంకాస్త యాడ్ చేస్తూ బన్నీ ‘శక్తి మాన్’ గా నటిస్తున్నాడు అంటూ ఓ టచ్ ఇచ్చారు. దీంతో త్రివిక్రమ్ – బన్నీ ప్రాజెక్ట్.. దాని నెగిటివిటీని అందరూ మర్చిపోయి.. ఈ ‘శక్తి మాన్’ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు.
దీనికి తోడు బసిల్ జోసెఫ్ గతంలో “మిన్నన్ మురళి” అనే సినిమా చేశాడు. ఆ సినిమా ‘శక్తి మాన్’ దగ్గర పోలికలు ఉంటాయి. దీంతో అల్లు అర్జున్ – బసిల్ జోసెఫ్ కాంబో మూవీ ‘శక్తి మాన్’ అంటే ఈజీగా అందరూ నమ్మేశారు.
అంతే తప్పా… ‘శక్తి మాన్’ గురించి బసిల్ జోసెఫ్ కు అసలు ఎలాంటి ఆలోచన లేదట. అయితే, బసిల్ జోసెఫ్ డైరెక్షన్ చేసిన మిన్నన్ మురళి సినిమాలా ఉంటే ఉండొచ్చు అని అంటున్నారు. అంతే కానీ, ‘శక్తి మాన్’కు బన్నీ సినిమాకు అసలేం సంబంధం లేదని మలయాళం ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
అయితే, అల్లు అర్జున్ – బసిల్ జోసెఫ్ సినిమా తప్పకుండా ఉంటుందని తెలుస్తుంది. అట్లీతో చేస్తున్న AA22 మూవీ పూర్తి అయిన తర్వాత బసిల్ జోసెఫ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ పట్టాలెక్కఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే బన్నీ దీనికి ముందు సందీప్ రెడ్డి వంగాతో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ సంబంధించి చాలా రోజుల క్రితమే అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఇప్పుడు AA22 తర్వాత బసిల్ జోసెఫ్ మూవీ ఉంటే, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ లేక పోలేదు.
అంతే కాదు, అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగా చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే, దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు.