Samyuktha Menon – NBK..నటసింహ నందమూరి బాలకృష్ణ (Natasimha Nandamuri Balakrishna) టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి విశేష సేవలు అందిస్తూ.. స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్నా.. వరుస యాక్షన్ చిత్రాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలు అంటూ బిజీగా మారిన ఈయన అంటే అభిమానులకే కాదు సినీ సెలబ్రిటీలకి కూడా గౌరవంతో కూడిన ఇష్టం అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆ ఇష్టాన్ని, గౌరవాన్ని ఒకేసారి చూపించింది ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon) . ధనుష్ (Dhanush) ‘సార్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ..’ విరూపాక్షా’ సినిమాతో తనలోని నటన కోణాన్ని అభిమానులకు చూపించి అబ్బురపరిచింది.
బాలయ్య పాదాలపై పడ్డ సంయుక్త మీనన్..
ఇదిలా ఉండగా.. తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్టులో దర్శనమిచ్చిన ఈమె.. అక్కడే బాలయ్యను చూసి.. ఆయనను పలుకరించి , ఆ తర్వాత బాలయ్య పాదాల మీద పడి ఆశీర్వాదం తీసుకుంది. సంయుక్త బాలయ్య పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడంతో.. బాలయ్య ఆమె తలపై చేయి పెట్టి మరీ ఆమెను దీవించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా బాలయ్య ఒక గొప్ప నటుడే కాదు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. అలాంటి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ..
ఏలూరులో సందడి చేసిన బాలకృష్ణ, సంయుక్త మీనన్..
ప్రముఖ సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ప్రముఖ సినీ హీరోయిన్ సంయుక్త మీనన్ తాజాగా ఏలూరులో సందడి చేశారు. ఏలూరు నగరంలోని బస్టాండ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక నగల దుకాణాన్ని బాలకృష్ణతో కలిసి నటి సంయుక్త కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఏలూరులో బాలకృష్ణ, సంయుక్త ను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారిపోయింది.
also read: HBD Tarun Arora: పెళ్లై 20 ఏళ్ల అయినా అందుకే పిల్లలు లేరు అంటున్న తరుణ్ అరోరా.. తప్పెవరిది?
అఖండ 2 అప్డేట్ ఇచ్చిన బాలయ్య..
ఇకపోతే ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత బాలకృష్ణ ‘ అఖండ 2 తాండవం’ గురించి ముచ్చటించారు సినిమా నిర్మాణం పూర్తయిందని, చాలా అద్భుతంగా వచ్చింది అని తెలిపారు. అంతేకాదు ఇటీవలే టీజర్ కూడా విడుదలైందని గుర్తు చేసిన ఆయన.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని కూడా అన్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇక మొత్తానికైతే అఖండ 2 తాండవం పై అప్డేట్ ఇచ్చి అభిమానులలో హైప్ క్రియేట్ చేశారు బాలకృష్ణ. ఇకపోతే బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) తో పాటు ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఇందులో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అఖండ సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరి సెప్టెంబర్ 25న విడుదల కాబోయే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
బాలకృష్ణ కాళ్లు మొక్కిన స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ pic.twitter.com/cBOyGWMtOh
— ChotaNews App (@ChotaNewsApp) June 14, 2025