BigTV English

90s Web Series OTT : OTTలోకి బిగ్ బాస్ పెద్దన్న కొత్త వెబ్ సిరీస్.. ఎప్పుడంటే?

90s Web Series OTT : OTTలోకి బిగ్ బాస్ పెద్దన్న కొత్త వెబ్ సిరీస్.. ఎప్పుడంటే?
90s web series

90s Web Series OTT : ప్రతివారం ఓటీటీలో కొత్త సినిమాలు రావడం, సందడి చేయడం కామన్. ఈవారం కూడా పండుగల సందర్భంగా సెలవులు కాబట్టి సందడి చేయడానికి ఓటీటీ లో సినిమాలు ,వెబ్ సిరీస్ క్యూ కట్టాయి. అయితే ఈసారి ప్రేక్షకుల ముందుకు సరికొత్త వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను ఓటిటీ వేదికగా మొదలు పెడుతూ రాబోతున్నాడు ఒకప్పటి హీరో. గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలో కాస్త జోరు తగ్గిన స్టార్ హీరో హీరోయిన్లు వరుస పెట్టి వెబ్ సిరీస్ తో మంచిగా పాపులర్ అయ్యారు. ఇదే పందా బాగుంది అనుకున్నాడో ఏమో ఈ మిడ్రేంజ్ హీరో కూడా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు సరికొత్త వెబ్ సిరీస్ తో రాబోతున్నాడు.


ఆ హీరో ఎవరో కాదండీ,ఒకప్పటి కాలేజ్ బాయ్ శివాజీ. ఇప్పటి జనరేషన్ కి శివాజీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ అప్పటి జనరేషన్ కి ఓ మోస్తారు హీరోగా శివాజీ బాగానే పరిచయమన్నాడు. కొన్ని రోజులు హీరోగా నటించినా,ఆ తర్వాత కాస్త ఆఫర్స్ తగ్గడంలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. ప్రస్తుతం మాత్రం బిగ్ బాస్ షోలో తెలుగు ప్రేక్షకులని ఓ రేంజ్ లో అలరించాడు. హౌస్ మొత్తాన్ని ఇన్ డైరెక్ట్ గా తన కంట్రోల్లో పెట్టుకొని బిగ్ బాస్ షోలో మునుపేన్నడు లేనంత ఎంటర్టైన్మెంట్ అందించాడు శివాజీ.

ప్రస్తుతం శివాజీ నటించిన కొత్త వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఆ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.. ఒకప్పటి శివాజీ మూవీస్ కామెడీ సూపర్ గా ఉండేది. లవ్ స్టోరీస్ తో పాటు మంచి కామెడీ ఓరియంటెడ్ హీరోగా ప్రేక్షకులకు బాగా దగ్గరైన శివాజీ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొద్ది కాలంగా రాజకీయాల్లో బాగా బిజీ అయిపోయి యాంగ్రీ యంగ్ మాన్ లుక్ లోకి మారిపోయిన శివాజీని తిరిగి మళ్లీ కడుపుబ్బ నవ్వించే క్యారెక్టర్ లో చూడబోతున్నాం అన్నమాట.


ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్గా వెళ్లిన శివాజీ ఇంటికే పెద్దన్నగా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఓటీటీ వేదికగా తిరిగి ఈ హీరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకీ శివాజీ హీరోగా వస్తున్న వెబ్ సిరీస్ పేరేంటో తెలుసా..నైంటీస్. ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వ బాధ్యతలను డైరెక్టర్ ఆదిత్య హాసన్ వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలో పవన్ సిస్టర్ గా చేసింది చూడండి.. వాసుకి ఇందులో హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. 

అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్.. ఇందులో శివాజీ లెక్కలు మాస్టారు గా కనిపిస్తారు. వనపల్లి జడ్పీహెచ్ స్కూల్లో టెన్త్ క్లాస్ లెక్కల మాస్టారు చంద్రశేఖర్ గా శివాజీ ఏం చేయబోతున్నాడో చూద్దాం.టైటిల్ వినడానికి విచిత్రంగా ఉన్న కాన్సెప్ట్ ఒకప్పటి 90 జనరేషన్ కిడ్స్ కి సంబంధించి సాగుతుంది అని అర్థమవుతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీపీ సంస్థ ఈటీవీ విన్ వేదికగా రిలీజ్ కాబోతోంది. నవంబర్ రెండవ వారంలో దీపావళి కానుకగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. 90 జనరేషన్ కి సంబంధించిన వాళ్ళందరూ తప్పకుండా చూడండి.. అలాగే అప్పటి జనరేషన్ కష్టాలు తెలియాలి అంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా కచ్చితంగా ఈ సిరీస్ ను మిస్ చేసుకోకండి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×