
Bigg Boss Season 7 : బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ -7 మొదలైంది. తార్ మార్ తక్కెడ మార్ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్ ఊహకు అందని విధంగా.. ఉల్లాఫుల్టాగా సాగుతుందని ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు. కంటెస్టెంట్లు గ్రాండ్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి ప్రియాంక జైన్ తొలుత బిగ్ హౌస్ లోకి అడుగుపెట్టింది. గెలిచి వస్తానంటూ శపథం చేసి లోపలికి వెళ్లింది. బిగ్ బాస్ హౌస్‌ను ప్రియాంక ప్రేక్షకులకు చూపించింది. ఆమె బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తి చేసింది. 2015లో తమిళంలో రంగి తరంగ చిత్రంతో వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత ఏడాది కన్నడ మూవీ గోలిసోడాలో నటించింది. 2018లో చల్తే చల్తే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి బుల్లితెరపై సీరియల్ స్టార్‌గా వెలుగుతోంది.
ఆ తర్వాత హీరో శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. తన గురించి చెబుతూ ఒక సోషల్ మెసేజ్‌తో శివాజీ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్ దామిని, నా పేరు మీనాక్షి సీరియల్ నటుడు ప్రిన్స్ యవార్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

రుద్రవీణ నటి శుభశ్రీ కూడా బిగ్ హౌస్ లోకి అడుగు పెట్టింది. అదే విధంగా మళయాళ, కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన షకీలా తనని తాను పరిచయం చేసుకుని షోలోకి ఎంటర్ అయ్యింది. డ్సాన్స్ మాస్టర్ సందీప్ బిగ్ హౌస్ లోకి వెళ్లాడు.

‘కార్తీక దీపం’ ధారావాహికలో మోనికాగా నటించిన శోభాశెట్టి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శోభాను ఎవరైనా “క్యూట్, బ్యూటిఫుల్ అని పొగిడితే వీకెండ్ లో ఆమెకు పనిష్మెంట్ ఉంటుందని నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టేస్టీ తేజ కూడా బిగ్‌బాస్-సీజన్7లో అడుగు పెట్టాడు. బిగ్‌బాస్‌లోని కంటెస్టెంట్‌లకు తాను చేసే వంటల రుచులు చూపిద్దామని షోలోకి వచ్చానని అన్నాడు.
చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రతిక రోజ్ కూడా బిగ్‌బాస్-సీజన్7లో అడుగు పెట్టింది. తాను బిగ్‌బాస్‌ను ‘పెద్దయ్య’ అని పిలుస్తానని చెప్పింది. షోలోని కంటెస్టెంట్‌లకు గట్టి పోటీ ఇస్తానని స్పష్టం చేసింది. యాక్టింగ్, డ్యాన్స్ తన హాబీలని తెలిపింది.

‘ఆకాశ వీధులో..’ సినిమాలో నటించిన గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్-సీజన్7లో అడుగు పెట్టాడు. తనకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమని తెలిపాడు. యాక్టర్ కావాలన్నది తన ఆశయమని పేర్కొన్నాడు. యాక్టర్ కావాలనుకున్న తాను డాక్టర్ అయ్యానని చెప్పాడు. డాక్టర్ నుంచి యాక్టర్‌గా ఎలా మారాడో చెప్పుకొచ్చాడు.
తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన కిరణ్ రాథోడ్ బిగ్‌బాస్ సీజన్-7లో 12వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. తనకు తెలుగు అంత బాగా రాదని చెప్పింది. షోలో నుంచి తిరిగి వెళ్లేలోపు తెలుగు నేర్చుకుంటానని తెలిపింది. శివాజీ తెలుగు బాగా నేర్పిస్తాడని ఆమెతో నాగార్జున అన్నారు. వారానికి కనీసం 10 తెలుగు పదాలు నెర్చుకోవాలని సూచించారు.

యూట్యూబర్, యువ రైతు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. అతనికి నాగార్జున మిర్చి మొక్కను ఇచ్చారు. మొక్కకు మిర్చి కాస్తే కొన్ని బెనిఫిట్స్ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. మిర్చి మొక్క ఎండిపోతే పనిష్‌మెంట్ ఉంటుందని హెచ్చరించారు. టీవీ సీరియల్ నటుడు అమర్‌దీప్ బిగ్ బాస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి గేమ్‌లోనూ పట్టువదలకుండా ఆడతానని చెప్పాడు.

ఇలా మొత్తం 14 మంది బిగ్ బాస్ సీజన్ -7లో హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే తమ మూవీస్ ను ప్రమోట్ చేసుకునేందుకు యువ హీరోలు విజయ్ దేవరకొండ (ఖుషి సినిమా) నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ) హౌస్ లో సందడి చేశారు. నవీన్ పొలిశెట్టి 15వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టాడు. సినిమా ప్రమోషన్‌లో కోసం బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చానని నవీన్ చెప్పాడు.