
Asia Cup : భారత్ జట్టు సోమవారం ఆసియా కప్ లో రెండో పోరుకు సిద్ధమవుతోంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో పసికూన నేపాల్ తో తలపడనుంది. పాకిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయ్యింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండటం క్రికెట్ ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తుంది.
పాక్ తో మ్యాచ్ లో భారత్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. పాకిస్థాన్ పేసర్ల దాటికి ప్రపంచ అగ్రశేణి బ్యాటర్లు చేతులెత్తేశారు. రోహిత్ (11) , కోహ్లీ (4), గిల్ (10), అయ్యర్ (14) తక్కువ స్కోర్ కే అవుటయ్యారు. ఈ దశలో ఇషాన్ కిషన్ (82), హార్థిక్ పాండ్యా ( 87) అద్భుతంగా ఆడి జట్టుకు గౌరప్రదమైన స్కోర్ ను అందించారు. కానీ చివరిలో మళ్లీ భారత్ జట్టు కుప్పకూలింది. దీంతో 266 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వర్షం వల్ల పాకిస్థాన్ ఇన్నింగ్ మొదలుకాలేదు. దీంతో మ్యాచ్ రద్దైంది.
పాక్ పై మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ వైఫల్యంగా స్పష్టం కనిపించింది. నేపాల్ తో జరిగే మ్యాచ్ లోనైనా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించాలి. బ్యాటింగ్ ప్రాక్టీస్ లా ఈ మ్యాచ్ ను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సూపర్ -4 భారత్ జట్టు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తో తలపడే అవకాశం ఉంది. నేపాల్ తో మ్యాచ్ లో రోహిత్, కోహ్లీ, గిల్, అయ్యర్ బాగా రాణించి సూపర్-4 మ్యాచ్ లకు ఫామ్ లోకి రావాలి.
నేపాల్ తో మ్యాచ్ కు స్టార్ పేసర్ బుమ్రా దూరం మయ్యాడు. అతని భార్య సంజన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఆదివారం శ్రీలంక నుంచి స్వదేశానికి వచ్చేశాడు. ప్రసవం తర్వాత తిరిగి జట్టులో చేరతాడు. బుమ్రా స్థానంలో షమి, ప్రసిద్ధ కృష్టలో ఒకరికి ఛాన్స్ దక్కుతుంది.
మరోవైపు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అడ్డుకున్న వరుణుడు మరోసారి వదిలేలా లేడు. నేపాల్- భారత్ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. భారత్-పాక్ మ్యాచ్ జరిగిన పల్లెకెలె మైదానంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సాగుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దైయితే పాకిస్థాన్ తోపాటు భారత్ జట్టు సూపర్ -4 కు చేరుకుంటుంది.
Elon musk: మస్క్‌కు చుక్కలు చూపించిన కొవిడ్ వ్యాక్సిన్.. చచ్చిపోయేంత టార్చర్