Bigg Boss Telugu: భగవంత్ కేసరి లో నవ్వులు పువ్వులు పూయించిన బిగ్ బాస్ హౌస్ స్నేక్.. రతికా రోజ్..

Bigg Boss 7 : భగవంత్ కేసరి లో నవ్వులు పువ్వులు పూయించిన బిగ్ బాస్ హౌస్ స్నేక్.. రతికా రోజ్..

Bigg Boss Telugu: భగవంత్ కేసరి లో నవ్వులు పువ్వులు పూయించిన బిగ్ బాస్ హౌస్ స్నేక్.. రతికా రోజ్..
Share this post with your friends

Bigg Boss 7 : నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ భగవంత్ కేసరి.. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల అయింది. విడుదలకు ముందే బీభత్సమైన బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. అంచనాలను మించి ప్రేక్షకాదరణ పొందుతోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్రంలో బాలయ్య , శ్రీ లీల తో పాటు మరొక బ్యూటీ అందరి దృష్టికి ఆకర్షించింది. ఆమె మరి ఎవరో కాదు తాజాగా తెలుగులో మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్.

ఇంతకీ ఎవరు ఆ కంటెస్టంట్ అనుకుంటున్నారా.. మరెవరో కాదండి హౌస్ లో ఎంటర్ అయిన క్షణం నుంచి.. తనకు నచ్చినవారితో పులిహార కలుపుతూ తన స్టైల్ లో గేమ్ ఆడి అందరి మతి పోగొట్టిన రతికా రోజ్. హౌస్ లో ఉన్నంతకాలం ఏదో ఒక కాంట్రవర్సీతో వైరల్ అవుతూ వచ్చిన రతికా.. మొదట్లో పల్లవి ప్రశాంత్, ఆ తర్వాత యావర్ ఫీలింగ్స్ తో బంతాట ఆడేసింది. ఆమె వేసే ప్లాన్స్ కు చిరాకు పుట్టిన ప్రేక్షకులు సైతం బిగ్ బాస్ స్నేక్ అనే బిరుదును ఇచ్చేశారు.

ఆ తర్వాత బిగ్ బాస్ షో నుంచి కూడా నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక ఈ మూవీ లో రతికా ఒక మహిళా మంత్రి పాత్రలో కనిపించింది. మంత్రి అంటే ఆషామాషీ మంత్రి కాదు.. ఇంగ్లీషులో మాట్లాడి నవ్వులు పువ్వులు పూయించే మంత్రి గెటప్ లో రతికా అద్భుతంగా నటించింది. ఇప్పటివరకూ భగవంత్ కేసరి మూవీ ప్రచారంలో ఎక్కడ రతికా పేరు మనం వినలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తాను కూడా ఈ విషయం గురించి ఎవరితో ప్రస్తావించలేదు. స్క్రీన్ పై ఆమెను చూసిన ప్రేక్షకులకు నిజంగానే ఊహించని షాక్ తగిలినట్లైంది. కొందరైతే స్క్రీన్ పై రతికా కనిపించగానే థియేటర్ లలో అరిచి గోల చేశారు.

నిజానికి రతిక చేసింది చాలా చిన్న పాత్ర. కానీ.. ప్రస్తుతం హౌస్ బయట ఆమెకు ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని ఆపడానికి ఇది కాస్తయినా పనికొస్తుందేమో చూడాలి. అయితే మూవీ రిలీజ్ కి ముందు రతికా బిగ్ బాస్ షోలో బాగా పాపులర్ అయింది కాబట్టే ఆమెను అందరూ గుర్తుపట్టగలిగారు . లేకపోతే ఏదో మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నట్టు భావించేవారు. చేసింది చిన్న పాత్రే అయినా.. కరెక్ట్ టైమింగ్ లో సినిమా విడుదల కావడంతో.. ఆమెకు మంచి గుర్తింపు లభించిందనే చెప్పాలి.

హౌస్ లో ఎంటర్ అయినప్పటి నుంచి ఫుల్ యాక్టివ్ గా ఉంటూ గేమ్స్ లో బాగా ఆడిన రతిక.. మొదట మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ.. ఆ తరువాత క్రమంగా తన అసలు రంగులు బయటపెట్టింది. మాజీ బాయ్ ఫ్రెండ్ అంటూ.. సింగర్‌ రాహుల్‌ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు రావడం, తన స్టోరీ చెప్పుకొని సింపతి కొట్టేయాలని ట్రై చేయడం, హౌస్ లో అటు ప్రశాంత్ ఇటు యావర్ తో నడిపిన ప్రేమాయణం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు చెప్పుకుంటూ పోతే రతికా గురించి ఓ చిన్న పుస్తకమే రాసేయొచ్చు. తన ప్రవర్తన కారణంగా కాస్త డీ పాపులర్ అయిన రతికా..భగవంత్ కేసరి పుణ్యమా అని కాస్త గట్టును పడుతుందేమో చూడాలి. ప్రస్తుతం అయితే.. మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లిందీ అమ్మడు. ఈసారైనా ఎవరి మనసులతో ఆడుకోకుండా గేమ్ ఆడుతుందేమో చూడాలి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Netflix : యూజర్లకు మరో షాక్ ఇవ్వనున్న నెట్ ఫ్లిక్స్

Bigtv Digital

Big Breaking : నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Bigtv Digital

Manchu Family: మంచు బ్ర‌ద‌ర్స్‌కి ప‌డ‌టం లేదా?

Bigtv Digital

Sai Dharam Tej:- పెళ్లిపై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన సాయిధ‌ర‌మ్ తేజ్‌

Bigtv Digital

Hi Nanna  : హాయ్ నాన్న సెన్సార్ కంప్లీట్..లెంగ్త్ ఏంటో తెలుసా?

Bigtv Digital

Adi Purush :- ఆది పురుష్ ఆడియో రిలీజ్ డేట్‌, ప్లేస్ ఫిక్స్

Bigtv Digital

Leave a Comment