Ayurveda: మనిషి దీర్ఘకాలం జీవించటమే కాదు… ఆరోగ్యంగానూ జీవించటం ముఖ్యం. దీనికి భారతీయ ఆయుర్వేదం 12 సూత్రాలను చెబుతోంది. అవేంటో తెలుసుకోండి. నేటి నుంచే శక్తి వంచన లేకుండా సాధన చేయండి. నిండైన జీవితాన్ని సొంతం చేసుకోండి.
ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం 4.30కి నిద్ర లేచి, నోరు పుక్కిలించి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.
ఓ గంటపాటు శరీర, శ్వాస వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, యోగా చేసి.. గోరు వెచ్చని లేదా చన్నీటితో స్నానం చేయాలి.
ఏరోజూ అల్పాహారం మరువొద్దు. ఉదయం 8.30 గంటల లోపు అల్పాహారం తీసుకోవాలి. అందులో పండ్లు లేదా పండ్లరసం ఉండాలి. అల్పాహారం చేసి వెంటనే పనిలో దిగండి.
మధ్యాహ్నంలోగా 2,3 గ్లాసుల మంచినీరు త్రాగాలి. భోజనానికి 48 నిమిషాల ముందు మరో గ్లాసు మంచి నీరు త్రాగాలి.
క్రింద కూర్చుని భోజనం చేయండి. ఆహారాన్ని బాగా నమిలితినాలి. మధ్యాహ్నపు కూరల్లో వాముపొడి వాడాలి. మధ్యాహ్న భోజనం కాస్త నిండుగానే తీసుకోవాలి.
మధ్యాన భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి. ఆ తర్వాత ఓ 40 నిమిషాలు కూర్పు తీయటం లేదా రిలాక్స్‌డ్‌గా కూర్చోవాలి.
తర్వాత యధావిధిగా సూర్యాస్తమయం వరకు పనిలో పడిపోవాలి. సూర్యాస్తమయం లోపు రాత్రి భోజనం పూర్తి చేసి.. ఓ కిలోమీటరు దూరం నడవాలి.
రాత్రి భోజనం చేశాక.. ఓ గంటకు ఓ గ్లాసుడు గోరువెచ్చని పాలు తాగాలి. ఎట్టి పరిస్థితిలోనూ రాత్రి 9 తర్వాత మేలుకోవటం పనికిరాదు.
రాత్రిపూట పెరుగు, మజ్జిగ, పుల్లటి పండ్లు, సలాడ్ తినకూడదు. అలాగే ఆహారంలో చక్కెర, ఉప్పు, మైదా వీలున్నంత తగ్గించాలి.
పాలు తాగినప్పుడల్లా అందులో పసుపు వేసి మరిగించి తాగితే.. కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది.
ఫ్రిజ్‌లోని పండ్లు, కూరగాయలు, పదార్థాలను గంట తర్వాతే తినాలి. అలాగే వండిన ఆహారం ఏదైనా 40 నిమిషాల లోపే తినేయాలి.
జూన్ నుంచి సెప్ట్ంబర్ మధ్యకాలంలో రాగి పాత్రలో నిల్వచేసిన నీటిని, మార్చ్ నుంచి జూన్ (ఎండాకాలంలో) మట్టి పాత్రలో నీరు త్రాగాలి.
ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, మద్యం, ధూమపానం సంగతి మరిచిపోండి.