BigTV English

Bhagavanth Kesari Collections : బాలయ్య మజాకా ..భగవంత్ కేసరి ఫస్ట్ డే కలెక్షన్స్..ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

Bhagavanth Kesari Collections : బాలయ్య మజాకా ..భగవంత్ కేసరి ఫస్ట్ డే కలెక్షన్స్..ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
Bhagavanth Kesari Collections

Bhagavanth Kesari Collections : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య.. సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి మూవీ ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి అనుకున్నట్లుగానే బాలయ్య మాస్ బీభత్సాన్ని సృష్టించాడు. ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో, మునుపెన్నడు చూడని విధంగా బాలయ్య మొదటిసారి పూర్తిగా డిఫరెంట్ స్టైల్ లో కనిపించారు. దీంతో నందమూరి అభిమానులు నిజంగానే ఈరోజు థియేటర్లలో దసరా పండుగ జరుపుకున్నారు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను ఒక ఆట ఆడేస్తోంది.


ఈ దసరా బరిలో భగవంత్ కేసరి అనుకున్న దానికంటే మంచి కలెక్షన్స్ రాబట్టేట్టుగా ఉంది. ఈ మూవీ కూడా బాలయ్య మూవీస్ లాగానే మాంచి మాస్ స్టోరీ, స్క్రీన్ అంతా రక్తం, భయంకరమైన ఫైట్లు, ఊర మాస్ డైలాగ్స్ తో థియేటర్ అంతా దద్ధరిల్లి పోయింది. ఒకరేమో మాస్ హీరో, ఇంకొకరు ఏమో కడుపు బాగా నవ్వించే డైరెక్టర్.. అసలు వీళ్ళిద్దరి కాంబోలో మూవీ సెట్ అవుతుందా అని అనుమానం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసి షాక్ అవుతున్నారు.

తండ్రీ కూతుర్ల అనుబంధాన్ని ప్రధానాంశంగా మలచుకొని తెరకెక్కించిన ఈ చిత్రం ఎమోషన్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సింది అని బాలకృష్ణ చెప్పిన విషయం 100% కరెక్ట్. ఒక మూవీలో ఎమోషన్ కూడా ప్రేక్షకులకు ఇంత బాగా కనెక్ట్ అవుతుందా అని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఇలాంటి మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? గ్రాఫ్ ఎంత వచ్చింది? ఓ లుక్కేద్దామా…!


మొదటి రోజు వరకు భగవంత్ కేసరి కలెక్షన్స్ బ్రహ్మాండంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఒకపక్క లియో ,మరొకపక్క రేపు బరిలోకి దిగనున్న టైగర్ నాగేశ్వరరావు పోటీని ఈ మూవీ ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి. ఇక మూవీ వసూళ్ల విషయానికి వస్తే లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల టాక్. మొదటిరోజు షోస్ పూర్తయ్య సమయానికి 14 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా.

భగవంత్ కేసరి మూవీ 68.50 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొదటి రోజు సుమారు 1350 థియేటర్లలో ఈ చిత్రం వరల్డ్ వైడ్ విడుదల అయింది.

ఇక మొదటి రోజు మార్నింగ్ షో కి హైదరాబాదులో 65 శాతం, బెంగళూరులో 66 శాతం ,విజయవాడలో 81 శాతం ,గుంటూరులో 90 శాతం ,విశాఖపట్నంలో 68 శాతం ,కాకినాడలో 67శాతం వరకు ఆక్యుపెన్సి వచ్చినట్లు సమాచారం. దీన్ని బట్టి బాలయ్య మూవీ మొదటి రోజే గట్టిగా వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. మరి ఇదే జోరు మరొక మూడు రోజులు అంటే పండగ పూర్తయ్యే వరకు కొనసాగితే కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×