Big Stories

Darling: తెలుగు సినిమా చరిత్రలోనే జనాలను ఏప్రిల్ ఫూల్స్ చేసిన సినిమా అంటే ఇదే మావా..

- Advertisement -

Darling: ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది.. సినిమాలో ట్విస్ట్ లు ముందే తెలిసిపోతున్నాయి. ఒకవేళ అలా కాకపోయినా సినిమా నాలెడ్జ్ ఉన్నవారు అయితే.. కొద్దోగొప్పో ఆ ట్విస్ట్ ను ముందే కనిపెట్టేస్తారు. కానీ, తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి ఒక ట్విస్ట్ ఉంటుందని ఊహించని సినిమా అంటే డార్లింగ్. అర్థమయ్యేలా చెప్పాలి అంటే.. ప్రేక్షకులను ఫూల్స్ ను చేసిన సినిమాలో డార్లింగ్ ను మించింది ఇంకొకటి లేదు. ఇక దీని గురించి ఈరోజే ఎందుకు గుర్తుచేసుకుంటున్నాం అంటే.. ఈరోజు ఏప్రిల్ ఫూల్స్ డే కాబట్టి. ప్రతి ఏడాది ఈరోజున కచ్చితంగా సినిమా లవర్స్ అయితే డార్లింగ్ సినిమాను గుర్తుచేసుకోకుండా ఉండలేరు. అసలు అంతలా జనాలను ఫూల్స్ చేసిన డార్లింగ్ సినిమా కథ ఏంటి అనేది చూద్దాం.

- Advertisement -

ప్రభాస్, కాజల్ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డార్లింగ్. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. 2010 ఏప్రిల్ 23 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ప్రభాస్ కు లవర్ బాయ్ ఇమేజ్ ను తీసుకొచ్చింది పెట్టింది. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ కు జనాలకు ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. సాధారణంగా ఒక సినిమాలో మహా అయితే 5 మినిట్స్ సాంగ్ డ్రీమ్ ఉంటుంది.. లేకపోతే చిన్న చిన్న షాట్స్ డ్రీమ్ ఉంటుంది. డార్లింగ్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రీమే ఉంటుంది.

డిటైల్డ్ గా చెప్పాలంటే.. ప్రభా(ప్రభాస్), నిషా(శ్రద్దా దాస్) కాలేజ్ లో ఫ్రెండ్స్. నిషా.. ప్రభా కన్నా జూనియర్. కాలేజ్ అయిపోయి ప్రభా వెళ్లిపోతుంటే తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. అయితే ప్రభా.. తనకా ఉద్దేశ్యం లేదని చెప్తాడు. దీంతో నిషా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక కూతురును ఈ పరిస్థితికి తీసుకొచ్చిన కుర్రాడును ఎలాగైనా చంపాలని నిషా తండ్రి(ముకేశ్ రిషి) ప్రభా ఫ్రెండ్స్ ను కిడ్నాప్ చేసి చితకబాదుతూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రభా.. ఫ్రెండ్స్ ను కాపాడడానికి వస్తాడు. అక్కడ తన కూతురును ఎందుకు పెళ్లి చేసుకోలేవు అన్న ప్రశ్నకు.. ప్రభా.. తన గతంలో నందిని( కాజల్) ఉందని తన గతాన్ని చెప్పుకొస్తాడు.

దేశం కానీ దేశంలో ఫ్రెండ్స్ తో పాటు ఒక ప్రోగ్రామ్ కోసం వెళ్లిన ప్రభాకు.. నందిని కనిపిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఫ్రెండ్స్.. తన ప్రేమను నందినికి చెప్పకూడదు అని కండిషన్ పెట్టడంతో తన ప్రేమను చెప్పకుండానే ఇండియాకు బయల్దేరతాడు. నందిని కూడా ప్రభా ప్రేమను అర్ధం చేసుకొని తన ప్రేమను వ్యక్తపరచడానికి వస్తున్న సమయంలో ఆమెకు యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉంటుంది. ఇప్పటికీ తననే తల్చుకుంటూ నందిని కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రభా చెప్పడంతో నిషా తండ్రి కన్నీళ్లు పెట్టుకొని.. మీ ప్రేమ గెలవాలని వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడి వరకు చూసిన ప్రేక్షకులు ఎవరైనా ఏమనుకుంటారు. మంచి లవ్ స్టోరీ.. నందిని లేస్తే బావుంటుంది అనుకుంటారు. కానీ, అప్పుడే డైరెక్టర్ అదంతా తూచ్.. ఏప్రిల్ ఫూల్స్ ను చేశామని చెప్పుకొచ్చి.. అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది అని బ్రేక్ ఇస్తాడు. ఇప్పటివరకు చూసిన ప్రేక్షకులు పిచ్చోళ్లను చేసి పడేశావ్ గా అనుకోవడం సాధారణమే. అలా తెలుగు సినిమా చరిత్రలోనే జనాలను ఏప్రిల్ ఫూల్స్ చేసిన సినిమా అంటే ఇదే మావా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఈరోజు డార్లింగ్ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత ఎన్నో సినిమాలు ఇలానే ప్రేక్షకులను ఫూల్స్ ను చేశాయి కానీ, ది బెస్ట్ అంటే డార్లింగ్ అనే చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News