BigTV English

SBI Service Down: దేశవ్యాప్తంగా పనిచేయని స్టేట్ బ్యాంక్ అకౌంట్లు.. కారణం ఏంటంటే..?

SBI Service Down: దేశవ్యాప్తంగా పనిచేయని స్టేట్ బ్యాంక్ అకౌంట్లు.. కారణం ఏంటంటే..?


State Bank of India Service Down on 1st April 2024: 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం సోమవారంతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్ 1, 2024 తేదీన వార్షిక ముగింపు కార్యకలాపం కారణంగా ఎస్‌బీఐకి సంబంధించి పలు సేవలు పనిచేయవని ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యోనో బిజినెస్ వెబ్, మొబైల్ యాప్, YONO, UPI సేవలు ఏప్రిల్ 1న 12.20 IST, 15.20 గంటల IST మధ్య అందుబాటులో ఉండవని SBI సోమవారం తెలిపింది. “వార్షిక ముగింపు కార్యాచరణ కారణంగా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యోనో సేవలు. బిజినెస్ వెబ్ & మొబైల్ యాప్, YONO, UPI సేవలు..  ఏప్రిల్ 1న 12:20 Hrs IST నుంచి 15:20 Hrs IST మధ్య అందుబాటులో ఉండవు. ఈ కాలంలో, UPI లైట్, ATM సేవలు అందుబాటులో ఉంటాయి” అని SBI పేర్కొంది.


దీంతో పాటుగా 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కూడా ఏప్రిల్ 1న అందుబాటులో ఉండదని పేర్కొంది. ప్రముఖ ప్రైవేట్ రంగం బ్యాంకు అయిన HDFC బ్యాంక్ కూడా ఏప్రిల్ 1న నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) లావాదేవీలు జరపబోమని ప్రకటించింది. అయితే ఏప్రిల్ 2వ తేదీ నుంచి బ్యాంకు లావాదేవీలు యదావిధిగా కొనిసాగుతాయని బ్యాంకులు ప్రకటించాయి.

ఏప్రిల్ 1న, భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వార్షిక ముగింపు కారణంగా బ్యాంకులు మూసివేయబడ్డాయి. అయితే చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇక్కడ కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది.

Also Read: Stock Market Highlights: కొత్త ఆర్ధిక సంవత్సరంలో జోష్.. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు సూచీలు

SBI డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెంచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ సహా వివిధ రకాల SBI డెబిట్ కార్డ్‌లకు వార్షిక నిర్వహణ ఛార్జీలను అప్‌డేట్ చేసింది. ఈ సవరించిన ఛార్జీలు క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లతో పాటు యువా, గోల్డ్, కాంబో, ప్లాటినం డెబిట్ కార్డ్‌లకు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. అదనంగా, SBI డెబిట్ కార్డుల జారీ, భర్తీకి సంబంధించిన ఛార్జీలను కూడా సవరించింది. దీంతో పాటుగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని క్రెడిట్ కార్డ్‌లకు అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Tags

Related News

PM Modi On Gst: ఎర్రకోట నుంచి సామాన్యులకు మోదీ శుభవార్త .. దీపావళి గిఫ్ట్, పన్ను రేట్ల తగ్గింపు

DMart Offer: డీమార్ట్ అద్భుతమైన ఆఫర్.. ఇవన్నీ సగం ధరకే.. ఇదే మంచి అవకాశం

సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు కార్ లోన్ తీసుకుంటున్నారా..అయితే మీరు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఇదే..

Jio special offer: స్వాతంత్ర్య దినోత్సవ jio ఆఫర్ ఇదే.. ఈ ఛాన్స్ ఒక్కరోజు మాత్రమే.. డోంట్ మిస్!

Real Estate: ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నారా…అయితే మార్ట్‌గేజ్ లోన్ ఎలా పొందాలి..? మీ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..

DMart Offers: డిమార్ట్‌లో ఆగస్టు నెలలో ఇన్ని ఆఫర్లా? వాటిపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్

Big Stories

×