E-Paper
Advertisement

Shahrukh Khan: షారుక్ ఒక దేశద్రోహి.. బహిష్కరించాలంటూ డిమాండ్!

Shahrukh Khan: షారుక్ ఒక దేశద్రోహి.. బహిష్కరించాలంటూ డిమాండ్!
Advertisement

Shahrukh Khan:బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ తన అద్భుతమైన నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నటన పరంగే కాకుండా అటు అత్యంత ధనవంతుల జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు షారుఖ్ ఖాన్. అయితే అలాంటి ఈయనను ఇప్పుడు దేశద్రోహి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొంతమంది ఏకంగా బహిష్కరించాలి అంటూ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

షారుక్ ఖాన్ పై మాజీ నేత మండిపాటు..

అసలు విషయంలోకి వెళ్తే.. బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా మైనారిటీలు ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు వారాలలోనూ ఏకంగా ముగ్గురు హిందువులను అత్యంత దారుణంగా చంపేశారు. అయితే దీని ప్రభావం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పై పడుతోంది. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు, కోల్కతా నైట్ రైడర్స్ ఇటీవల వేలంలో బాంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కొనుగోలు చేసింది. సుమారుగా రూ.9.2 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఇక్కడ అసలు చిక్కేమిటంటే బాంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ ను షారుఖ్ ఖాన్ కొనుగోలు చేయడంపై బీజేపీతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా షారుఖ్ ఖాన్ పై మండిపడుతున్నారు.

షారుఖ్ ఖాన్ ఒక దేశద్రోహి..

Advertisement

ఉత్తరప్రదేశ్ కి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మాట్లాడుతూ.. “ఒకవైపు బంగ్లాదేశ్ లో హిందువులను చంపుతుంటే.. మరొకవైపు ఐపీఎల్ లో బంగ్లాదేశ్ క్రికెటర్లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ క్రికెటర్లను కొనుగోలు చేసిన షారుఖ్ ఒక దేశద్రోహి. దేశద్రోహి అయిన సినీ నటుడు షారుక్ ఖాన్ బంగ్లాదేశ్ క్రికెటర్ రెహమాన్ ను ఏకంగా తొమ్మిది కోట్లకు కొనుగోలు చేశాడు. ఇలాంటి దేశద్రోహులకు ఈ దేశంలో జీవించే హక్కు లేదు. ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చడానికి సహాయం చేశారు. మీకు డబ్బు వస్తే..అది ఈ దేశం నుండే వస్తుంది.. కానీ మీరు దేశానికి ద్రోహం చేశారు” అంటూ మీరట్ లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్లో పాల్గొని ఆయన కామెంట్లు చేశారు. మొత్తానికి అయితే షారుక్ ఖాన్ పై ఇప్పుడు ట్రోల్స్ భారీగా వైరల్ అవుతున్నాయి.

ALSO READ:Renu Desai: ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్..ఆ బేబీ ఎవరో తెలుసా?

షారుఖ్ ఖాన్ పై విమర్శల వెల్లువ..

Advertisement

షారుఖ్ ఖాన్ పై ఆధ్యాత్మిక గురువు దేవకీనందన్ ఠాకూర్ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అతడిని తన జట్టులో చేర్చుకోవద్దని కేకేఆర్ యాజమాన్యానికి తెలిపారు. కేకేఆర్ యజమానిని స్టార్గా చేసిన హిందువులు బంగ్లాదేశ్ లో చంపబడుతుంటే.. వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఇలా తమ జట్టులోకి బాంగ్లాదేశ్ క్రికెటర్ ను చేర్చుకోవడం ఏమాత్రం సమంజసంగా లేదు అని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో షారుక్ ఖాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారేమో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×