E-Paper
Advertisement

Renu Desai: ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్..ఆ బేబీ ఎవరో తెలుసా?

Renu Desai: ఒడిలో చంటిబిడ్డతో రేణూ దేశాయ్..ఆ బేబీ ఎవరో తెలుసా?
Advertisement

Renu Desai:ప్రముఖ సినీ నటిగా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రేణూ దేశాయ్ (Renu Desai).. ఇండిపెండెంట్ ఉమెన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసిన రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో సహజీవనం చేసి పెళ్లికి ముందే అఖీరా నందన్ కు జన్మనిచ్చింది. కొడుకు సమక్షంలోనే వివాహం చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత ఆధ్యకు జన్మనిచ్చారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. పిల్లలు ఇద్దరిని తీసుకొని ముంబైకి వెళ్లిన ఈమె అక్కడే సెటిల్ అయ్యి.. వారి ఆలనా పాలనా చూసుకుంటూ పిల్లలకు ఒక స్థానాన్ని కల్పించే ప్రయత్నం చేస్తోంది.ఈ క్రమంలోనే ఇండిపెండెంట్ ఉమెన్ గా తన పిల్లల బాధ్యతను చేపట్టిన ఈమె.. అటు ఎన్జీవో సంస్థలను కూడా స్థాపించి మూగజంతువులకు అండగా నిలిచింది.

సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగా మొదలుపెట్టిన రేణూ దేశాయ్..

ఇకపోతే ఈ మధ్యకాలంలో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె మళ్లీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను, వ్యక్తిగత క్షణాలను అభిమానులతో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి వరుస ప్రాజెక్టుతో సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ కూడా ఇచ్చింది. ‘పదహారు రోజుల పండుగ’ అనే ఒక కొత్త చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో సాయికిరణ్ అడవి హీరోగా నటిస్తూ ఉండగా.. షూటింగ్ కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. అటు దర్శక నట బృందంతో కలిసి ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది అంటూ తెలిపింది.

Advertisement

ALSO READ:Naa Anveshana: మరో వీడియోతో రెచ్చిపోయిన అన్వేష్.. ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ ను లాగుతూ!

ఒడిలో చంటి పిల్లతో రేణు దేశాయ్..

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయడం అది హాట్ టాపిక్ గా మారింది. అందులో ఆమె ఒడిలో ఒక చిన్నారి ఉండగా తీసిన ఫోటోని షేర్ చేయడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల లాంటివారు. ఈ చిన్నారి తన ముద్దులొలికే రూపంతో నా హృదయాన్ని దోచుకున్నాడు” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ కూడా జత చేసింది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ పోస్ట్ కి కామెంట్ సెక్షన్ ఆమె ఆఫ్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రేణు దేశాయ్ ఒడిలో ఉన్న ఆ చిన్నారి ఎవరు? ఎందుకు రేణు దేశాయ్ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసింది? అంటూ ప్రశ్నలు సోషల్ మీడియాలో వెళ్ళు వెత్తుతున్నాయి. మొత్తానికి అయితే ఒకవైపు తన సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేసిన ఈమె మరొకవైపు ఇలాంటి ఎమోషనల్ పోస్టులు పెట్టి మళ్ళీ వార్తల్లో నిలిచింది.

Advertisement

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×