BigTV English
Advertisement

Bollywood:షాప్ ఓపెనింగ్ వచ్చిన బాలీవుడ్ నటిపై దాడి… ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ..!

Bollywood:షాప్ ఓపెనింగ్ వచ్చిన బాలీవుడ్ నటిపై దాడి… ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ..!

Bollywood:సాధారణంగా ఒక్క సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు బహిరంగంగా ఆడవారికి భద్రత లేదు అని ఇప్పటికే ఎంతోమంది ఎన్నో రకాలుగా వెల్లడించిన విషయం తెలిసిందే. మిగతా రంగాలతో పోల్చుకుంటే సినిమా రంగం గురించి ఎప్పటికప్పుడు వార్తలు బయటకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా రంగంలో జరిగే ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతుంది. దీనికి తోడు సినీ ఇండస్ట్రీలో ఆడవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొంతమంది లైంగికంగా నరకం అనుభవిస్తూ.. ఇండస్ట్రీని వదిలి పారిపోతున్నారు. ఇంకొంతమంది ధైర్యంగా వాటిని కట్టడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకోవడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


మాల్ ఓపెనింగ్ కోసం వచ్చిన నటి పై హైదరాబాద్ యువకులు దాడి..

బాలీవుడ్ నటిపై హైదరాబాద్ కి చెందిన కొంతమంది యువకులు అత్యాచారయత్నం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఒక నటిని హైదరాబాదులో షాపు ఓపెనింగ్ కి గెస్ట్ గా ఆహ్వానించారు. అందుకు తగ్గట్టుగా రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని చెప్పడంతో ఆమె కూడా అంగీకరించి హైదరాబాద్ వచ్చింది. ఈవెంట్ కోసం హైదరాబాదు వచ్చిన ఆ నటి మాసబ్ ట్యాంక్ శ్యామ్ నగర్ కాలనీ లోని అపార్ట్మెంట్లో బస చేసింది. అయితే అదే రోజు హోటల్లో రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు యువకులు.. నటి ఉన్న గదిలోకి వచ్చి వ్యభిచారం చేయాలని ఆమెను బలవంతం చేశారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో మాతో సహకరించకపోతే చంపేస్తామని ఆ యువకులు బెదిరించారట. దీంతో బెదిరిపోయిన ఆ నటి అరచి గోల పెట్టడంతో.. ఆమె నోట్లో గుడ్డ కుక్కి, ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఆమె బ్యాగులో ఉండే రూ.50 వేల డబ్బులు, కొంత నగలు తీసుకొని పారిపోయారట.


Akhanda 2: అయోమయంలో పడ్డ నిర్మాతలు.. వెనక్కి తగ్గుతారా..?

రంగంలోకి దిగిన పోలీసులు..

ఇక వారు వెళ్ళిపోయిన తర్వాత కట్లు విడిపించుకుని హోటల్ నుండి బయటపడిన నటి డయల్ 100 కి ఫోన్ చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. బాధితురాలు మాసబ్ ట్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏది ఏమైనా ఒక షాప్ ఓపెనింగ్ కోసం అని వచ్చిన నటికి ఇక్కడ ఊహించని పరిణామం ఎదురవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అతిధులను మనం భగవంతుడితో సమానంగా చూసుకోవాలి. అలాంటిది షాపు ఓపెనింగ్ కోసం ఆమెను పిలిచి.. ఆమెకు భద్రత కల్పించకుండా.. యాజమాన్యం కళ్ళు మూసుకొని నిద్రపోతోందా,తమ గెస్ట్ కి కనీస సౌకర్యాలతో పాటు భద్రత కల్పించాల్సిన అవసరం లేదా అంటూ మాల్ యాజమాన్యంపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాపం నటి అంటూ కూడా మరి కొంతమంది నిట్టూరుస్తున్నారు. ఏది ఏమైనా ఒంటరిగా ఇక్కడికి రావడం తప్పైపోయింది, ఆమె ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడంతో పూర్తిగా భయపడిపోయి ఉంటుంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి రంగంలోకి దిగిన పోలీసులు సదరు నటిని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×