BigTV English

Akhanda 2: అయోమయంలో పడ్డ నిర్మాతలు.. వెనక్కి తగ్గుతారా..?

Akhanda 2: అయోమయంలో పడ్డ నిర్మాతలు.. వెనక్కి తగ్గుతారా..?

Akhanda 2: నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ వయసులో కూడా ఏమాత్రం వెనుకడుగు వెయ్యకుండా.. వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిపోయారు. అంతేకాదు ఆ సినిమాలలో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టడమే కాకుండా యంగ్ హీరోలకు సైతం ముచ్చేమటలు పట్టిస్తున్నారు బాలయ్య. ఒకవైపు హీరోగా, మరొకవైపు అన్ స్టాపబుల్ వంటి కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటూ రాజకీయ నేతగా కూడా చలామణి అవుతూ దూసుకుపోతున్నారు. ఇకపోతే బాలకృష్ణ కెరియర్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి బాలకృష్ణను మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.


అఖండ 2 తో సంచలనం సృష్టించడానికి సిద్ధమైన బాలయ్య..

ఇప్పుడు అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలయ్య – బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి . ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ రావడంతో ఇప్పుడు ఈ సినిమా అంతకుమించి సక్సెస్ అవుతుందని నెటిజెన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అఖండ 2 సినిమా ఇటీవలే మహా కుంభమేళా ప్రయాగరాజ్ లో జరగగా.. అక్కడ కొంత భాగం షూటింగ్ కూడా నిర్వహించారు. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


పెరిగిపోయిన బడ్జెట్.. అయోమయంలో పడ్డ నిర్మాతలు..

ఇకపోతే ఈ సినిమా గురించి ఏడాది కాలంగా అభిమానులలో చర్చ జరుగుతోంది.అదిగో ఇదిగో అంటూ అఖండ 2 గురించి పెద్ద ఎత్తున పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. అటు బోయపాటి శ్రీను కూడా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది.ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఒక వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకెళితే.. ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమా కోసం రూ.150 కోట్ల బడ్జెట్తో నిర్మించాలని అనుకున్నారు. అఖండ 2 సినిమాకి ఉన్న బజ్ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు బడ్జెట్ కూడా పెంచుతూ వచ్చారు. పైగా షూటింగ్ కార్యక్రమాలలో కూడా ఎక్కడా రాజీ పడకుండా చేస్తున్న కారణంగా.. రూ.175 కోట్ల వరకు బడ్జెట్ పెరిగడం తో నిర్మాతలు కాస్త భయపడిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇంకా షూటింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో రూ.200 కోట్లు దాటే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రూ.150 కోట్ల బడ్జెట్ అనుకొని ఆ తర్వాత అనూహ్యంగా మరో 50 కోట్ల పెంపు అంటే కాస్త అయోమయంలో పడినట్లు సమాచారం. అయితే బాలకృష్ణ, బోయపాటి మీద ఉన్న నమ్మకంతోనే నిర్మాతలు కూడా వెనుకడుగు వేయడం లేదని సమాచారం. ఒకవేళ బాలకృష్ణ ఉన్న క్రేజ్ ని బట్టి ఈ సినిమా అంతకుమించి విజయాన్ని అందుకుంటే ఖచ్చితంగా రూ.250 కోట్లు వసూల్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా రూ.200 కోట్లు కూడా ఇప్పుడు ఈ సినిమాకి భారం కాకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి బాలయ్య సినిమా కోసం ఇంత రిస్క్ చేస్తున్న నిర్మాతలకు అఖండ 2 ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×