BigTV English

Kunal Kapoor Joins in Viswambhara: మెగాస్టార్ అభిమానులకు పండగే.. ‘విశ్వంబర’లో విలన్‌గా బాలీవుడ్ హీరో

Kunal Kapoor Joins in Viswambhara: మెగాస్టార్ అభిమానులకు పండగే.. ‘విశ్వంబర’లో విలన్‌గా బాలీవుడ్ హీరో

BollyWood Hero Vilan Role in Viswambhara Movie: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇంటర్‌వెల్ సమయంలో వచ్చే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ఇటీవల మేకర్స్ పూర్తి చేశారు. ఇందులోని ఫైటింగ్‌కు సంబంధించిన సీన్లను రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరించారు. తాజాగా మేకర్స్ సినిమా అప్డేట్ ప్రకటించారు.


విలన్ అతడే..

‘విశ్వంభర’ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హీరో కనిపిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు డైరెక్టర్ వశిష్ఠ సోషల్ మీడియాలో చెబుతూ ఒక ఫొటో షేర్ చేశారు. ఈ సినిమాతో బాలీవుడ్ హీరో కునాల్ కపూర్ విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. కునాల్ కపూర్ గతంలో అక్కినేని నాగార్జున, నాని నటించిన దేవదాస్ సినిమాలో ప్రత్యేక పాత్రలో సందడి చేశాడు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు విలన్ పాత్రలో అడుగుపెడుతున్నాడు. మొదట ఈ సినిమాలో విలన్‌గా దగ్గుబాటి రానాకు అవకాశం దక్కింది. అయితే రానా మరో సినిమాలో నటించనున్న నేపథ్యంలో ఈ పాత్రకు నో చెప్పినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కునాల్ ఎవరో కాదు.. అమితాబ్ బచ్చన్ సోదరుడి కూతురు నైనా బచ్చన్‌ను కునాల్ వివాహం చేసుకున్నాడు.


Also Read:  సినిమాలు మాత్రమే ఫ్లాప్.. యాక్టర్‌గా నేనెప్పుడూ ఫెయిల్‌ కాలేదు.. టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అభిమానుల్లో జోష్…

రూ.200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని టాక్ వస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులో త్రిష, ఆషికా పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుస అప్డేట్‌లతో సందడి చేస్తున్న మేకర్స్.. మరో అప్డేట్ ఇవ్వడంతో అభిమానుల్లో జోష్ మొదలైంది.

కునాల్ పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఆయన విలన్ అని తెలిసే ట్విస్ట్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తతుం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోందని, జులై చివరి వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధానం ఉన్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి మొన్నటి వరకు పవన్ కల్యాణ్ కోసం రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. ఎట్టకేలకు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించడంతో చిరంజీవి ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నాడు. ఇక వెంటనే సినిమా మోడ్‌లోకి రానున్నారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విశ్వంభర సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. అంతకుముందు చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి వంటి సోషియో ఫాంటసీ సినిమాలో నటించారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×