BigTV English

Tollywood: పెళ్లి కాకుండానే తల్లిదండ్రులైన తమన్నా- విజయ్..!

Tollywood: పెళ్లి కాకుండానే తల్లిదండ్రులైన తమన్నా- విజయ్..!

Tollywood.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలు అందరి సరసన నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ తమన్నా (Tamannaah) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.తన అందంతో, నటనతో మిల్క్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమె రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun),ప్రభాస్(Prabhas), ఎన్టీఆర్(NTR) , చిరంజీవి (Chiranjeevi) వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది. ఇకపోతే ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇతడితో ఏడడుగులు కూడా వేయబోతుందని సమాచారం. అయితే అంతలోనే విడిపోతున్నారు అంటూ వార్తలు రాగా.. మళ్లీ ఒకే చోట కనిపించి వార్తలకు చెక్ పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా పెళ్లి కాకుండానే వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


సక్సెస్ దిశగా రవీనా టాండన్ కూతురు..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో చాలామంది స్టార్ కిడ్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంతకుముందు షారుక్ ఖాన్ (Shahrukh khan) కుమార్తె సుహానా ఖాన్ (Suhana Khan), శ్రీదేవి( Sridevi ) కుమార్తె ఖుషీ కపూర్ (Kushi Kapoor) తెరకు పరిచయం అవ్వగా.. ఇప్పుడు రవీనా (Rasha Thadani) టాండన్ (Raveena Tandon) కుమార్తె రాషా తడానీ కూడా ‘ఆజాద్’ చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇలా ఒక్కొక్కరిగా నట వారసురాళ్ళు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు కానీ సుహానా ఖాన్, ఖుషీ కపూర్ ల మించిన క్రేజ్ ఇప్పుడు రాషా తడానీ సంపాదించుకుంది. దానికి కారణం రవీనా టాండన్ లో ఉన్న ఛామ్ తో రాషా తడాని అందరినీ ఆకర్షించడమే.. అజయ్ దేవగన్ (Ajay Devgan) మేనల్లుడు ఆమన్ దేవగన్ (Aman Devgan) సరసన నటించింది.


Betting Apps Case: ప్రభాస్, బాలయ్యలపై కేసు… వేల కోట్లున్నా.. ప్రజలతో చెలగాటమా..?

వారు నాకు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు..

ఇదిలా ఉండగా తాజాగా స్నేహం గురించి మాట్లాడిన రాషా.. అదే స్నేహం గురించి చెబుతూ తనకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు వారే అంటూ తెలిపింది. ఒక తన 20వ బర్తడే పార్టీలో తమన్నాతో పరిచయం ఏర్పడగా.. ఇప్పుడు అత్యంత సన్నిహితులయ్యామని చెప్పిన ఆమె.. మొదటిసారి బర్తడే పార్టీలో కలిసినప్పుడు తమన్నాను ఆంటీ అని పిలిచింది రాషా తడాని. అయితే ఆ సమయంలో తమన్నా కూడా ఈ విషయాన్ని చాలా లైట్ గానే తీసుకుంది. కానీ ఇంతలోనే ఇప్పుడు రాషా తమన్నా – విజయ్ వర్మలను దేవుడిచ్చిన తల్లిదండ్రులు అంటూ చెప్పిందిmm” ఒక పార్టీలో గాయకుడు పాడుతుంటే నేను డాన్స్ చేస్తున్నాను. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తమన్నా నాతో పాటు ఆ పాటకు స్టెప్ కలిపింది.అప్పటి పరిచయం తర్వాత వేగంగా మా మధ్య బంధం పెరిగిపోయింది. తమన్నాతో నాకు ఎంతగానో అనుబంధం ఏర్పడింది. ఇక విజయ్ – తమన్నా నాకు అత్యంత సన్నిహితులని భావిస్తాను. ఇప్పుడు తమన్నా లేకుండా నేనేం చేయాలో కూడా నాకు తెలియదు. తమన్నా, విజయ్ వర్మ నాకు అత్యంత సన్నిహితులు మాత్రమే కాదు నాకు వాళ్ళు గాడ్ పేరెంట్స్ లాంటివాళ్ళు అంటూ రాషా వ్యాఖ్యానించింది. మొత్తానికైతే ఈ మిల్క్ బ్యూటీ రాషాకు ఆంటీగానో , మమ్మీ గానో సినిమాలలో నటించే అవకాశం కూడా ఉందని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ తమన్నా విడిపోయారు అంటూ వస్తున్న వార్తల మధ్య రాషా చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×