నేడే రాజస్థాన్ తో హైదరాబాద్ తొలి మ్యాచ్:
Pat Cummins: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తెలపడబోతోంది. ఈ తొలి మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీని గెలుపుతో ఆరంభించాలని భావిస్తుంది ఎస్.ఆర్.హెచ్. గత సంవత్సరం పాట్ కమిన్స్ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్ కీ చేరుకుంది.
Also Read: RCB: తొలి విజయంతో టెన్షన్ లో ఆర్సీబీ… ఇక వరుసగా ఓటమిలేనా…!
కానీ చివరి మెట్టుపై బోల్తా పడింది. కలకత్తా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోవడంతో తృటిలో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని చేజార్చుకుంది. కానీ ఈసారి కచ్చితంగా ఐపీఎల్ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సన్రైజర్స్ బ్యాటింగ్ సునామీ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోత ఆ రేంజ్ లో ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కాటేరమ్మ కొడుకులతో నింపేసింది కావ్య మారన్. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ విధ్వంసం గత సీజన్ లో చూసాం.
హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్.. జూలు విధిల్చడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది హైదరాబాద్. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు దానిని మించి ఎస్ఆర్హెచ్ 2.0 చూస్తామని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. హైదరాబాద్ అభిమానుల నినాదం కూడా ఒక్కటే. అబ్ కీ బార్.. 300 పార్ అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. గత సీజన్ లోనే 300 పరుగులు చేసేలా కనిపించింది ఎస్ఆర్హెచ్. కానీ 300 మార్క్ ని చేరుకోలేకపోయింది. ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్ పక్కా 300 పరుగులు కొడుతుందని అభిమానులు ధీమాతో ఉన్నారు.
SRH 300 కొట్టడం పక్కా:
తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ అభిమానులతో నిర్వహించిన సమావేశంలో తన మూడు వేళ్లను చూపిస్తూ 300 పరుగులకి ట్రై చేస్తామని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఈ సందర్భంగా కమీన్స్ మాట్లాడుతూ.. ” గత సంవత్సరం మన బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. అదే ప్రదర్శనను ఈ సంవత్సరం కూడా పునరావృతం చేసి భారీ స్కోర్లు చేయొచ్చు” అని పేర్కొన్నారు.
Also Read: Virat Kohli: బుడ్డోడికి అదిరిపోయే ట్రీట్.. కోహ్లీ అంటే ఇట్లాగే ఉంటది !
అయితే గత ఐపీఎల్ లో అత్యధిక పరుగులను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు పై సాధించింది సన్రైజర్స్ హైదరాబాద్. మరి ఈ ఏడాది ఏ జట్టుపై అత్యధిక పరుగులు సాధిస్తుందో వేచి చూడాలి. 263 పరుగుల 11 ఏళ్ల బెంగుళూరు రికార్డు ని గత సంవత్సరం బద్దలు కొట్టింది ఎస్ఆర్హెచ్. ఈసారి ఎస్.ఆర్.హెచ్ 287 పరుగుల తన రికార్డును బ్రేక్ చేస్తుందా..? లేదా అన్నది వేచి చూడాలి. అభిమానులు మాత్రం ఈ సారి 300 పరుగులు దాటడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు.