Betting Apps Case:రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడా సెలబ్రిటీలుగా పేరు సొంతం చేసుకున్న ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో సడన్గా వేలకోట్ల ఆస్తులు ఉన్నా.. ప్రజలకు మంచి చేకూరుస్తూ మంచి పేరు సొంతం చేసుకున్న ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఏకంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇక వారెవరో కాదు నటసింహా నందమూరి బాలకృష్ణ (Natasimha Nandamuri Balakrishna) రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), గోపీచంద్ (Gopichand). అసలు విషయంలోకి వెళ్తే.. ఆహా ఓటీటీ వేదికగా బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 షోలో నటుడు గోపీచంద్, ప్రభాస్, బాలకృష్ణ సంయుక్తంగా ‘Fun88’ అనే చైనీస్ బెట్టింగ్ యాప్ ను సంయుక్తంగా ప్రమోట్ చేశారు అంటూ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో రామారావు ఇమ్మనేని అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. లక్షలాది మందిని మోసం చేశారని, పైన పేర్కొన్న వ్యక్తులపై సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కూడా ఫిర్యాదుదారు పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక దీనిపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.
Allu Arjun: అబుదాబిలో అల్లు అర్జున్.. భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ..!
వేల కోట్లన్నా.. ఇదేం పోయేకాలం..
ఇదిలా ఉండగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ప్రభాస్, బాలకృష్ణ పేరు సొంతం చేసుకోవడమే కాకుండా తమ సినిమాల ద్వారా వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. అంతేకాదు సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా పలు వ్యాపారాలలో కూడా పెట్టబడులు పెట్టి వేల కోట్ల రూపాయలను సొంతం చేసుకున్న వీరు.. ప్రజలకు మంచి చేకూర్చాలి కానీ మళ్ళీ డబ్బు కోసం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి? వీరికి ఇదేం పోయేకాలం? అంటూ నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
వాస్తవానికి ప్రజలకు నష్టం వచ్చినా..కష్టం వచ్చినా ఆదుకోవడంలో అటు బాలకృష్ణ , ఇటు ప్రభాస్ ఇద్దరూ ముందుంటారు. అలాంటి వీరు వీటివల్ల ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని తెలిసినా కూడా ఎందుకు ప్రమోట్ చేశారు అనే కోణంలో అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు.
ప్రభాస్ సినిమాలు..
ఒక ప్రభాస్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలు పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంటుంది.
బాలకృష్ణ సినిమాలు
బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇక ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయంగా కూడా అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వీరు ఇప్పుడు ఇలా బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కోవడం నిజంగా సంచలనం అనే చెప్పాలి.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో స్టార్ హీరోలు..!
నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
స్టార్ హీరోలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడంతో లక్షలాది మంది డబ్బు పోగొట్టుకున్నారని, మ్యూల్ ఖాతాల ద్వారా చైనీయులకు ఈ నగదు చేరిందని రామా రావు అనే వ్యక్తి… pic.twitter.com/dDpgWLSCW7
— BIG TV Breaking News (@bigtvtelugu) March 23, 2025