BigTV English

Bollywood Actress : బ్రేకప్ అయితే బాధేంటి..? పార్టీ చేసుకోవాలి పుష్ప

Bollywood Actress : బ్రేకప్ అయితే బాధేంటి..? పార్టీ చేసుకోవాలి పుష్ప

Bollywood Actress : అప్పట్లో వచ్చిన ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ గుర్తుందా…? “లవ్ ఎప్పుడూ కొంతకాలమే బాగుంటుంది” .. “ప్రేమించే కాలం ఎక్కువ అయ్యే కొద్ది ప్రేమ తగ్గిపోతుంది” అంటూ ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ ఇప్పుడు అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు ఇది మరీ ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. అందుకే ఒకరితో ఎక్కువ రోజులు రిలేషన్‌షిప్‌లో ఉండలేకపోతున్నారు వాళ్లు.


ఎక్కడో మూవీ సెట్స్ లో కలిసి లవ్‌లో పడిపోతున్నారు. పెళ్లి వరకు రాకముందే… మ్యూచువల్ అండర్స్టాండింగ్‌తో విడిపోయి… హ్యాపీగా ఉంటున్నారు. కొంత మంది పెళ్లి చేసుకుని కూడా విడిపోతున్నారు.

మొన్నా ఆ మధ్య బాలీవుడ్ నటి అనన్య పాండే.. తన ప్రియుడు ఆదిత్యరాయ్ కపూర్‌తో డేటింగ్‌లో ఉండేది. వాళ్లు ఇద్దరు చట్టాపట్టాలేసుకుని బీ టౌన్ మొత్తం తిరిగేశారు. వాళ్లపై వచ్చిన గాసిప్స్ అన్నీ ఇన్ని కాదు. ఈ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలెక్కడం దాదాపు ఖాయం అని అందరూ అనుకున్నారు.


కానీ, అందరికీ షాక్ ఇస్తూ వాళ్లు ఇద్దరు విడిపోయారు. విడిపోవడం ఒకే… కానీ, విడిపోయిన తర్వాత అనన్య పాండే బ్రేకప్ పార్టీ చేసుకుంది. పార్టీ చేసుకోవడం వరకు కూడా ఒకే అనుకోవచ్చు. కానీ, ఆ బ్రేకప్ పార్టీకి తన మాజీ ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్‌ను కూడా ఇన్వైట్ చేసి… అక్కడ ఉన్న వారందరితో పాటు జనాలకు కూడా షాక్ ఇచ్చింది.

తమన్నా.. కూడా…

ఇక నిన్నటికి నిన్న… తమన్నా కూడా అదే చేసింది. విజయ్ వర్మతో ఇన్నాళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ మిల్క్ బ్యూటీ… ఇటీవల ఆ బంధాన్ని తెంచుకుంది. సోషల్ మీడియాలో ఒకరి ఫోటోలు ఒకరు డిలీట్ చేసుకున్నారు. దీంతో బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలో బ్రేకప్ వార్తలు వచ్చాయి. ఇలా ఎన్ని వార్తలు వచ్చినా… వాళ్లు సైలెంట్‌గానే ఉన్నారే తప్పా.. ఎక్కడా స్పందించలేదు.

ఇటీవల బ్రేకప్ అయింది. కదా తమన్నా పరిస్థితి ఏంటో అందరు అనుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఏం జరగలేదు అన్నట్టు హ్యాపీగా హోలీ చేసుకుంది. అది మాత్రమే కాదు… ఆ హోలీ వేడుకల్లో తమన్నా పక్కనే మాజీ ప్రియుడు విజయ్ వర్మ కూడా ఉన్నాడు.

బాలీవుడ్ నటి రవీనా టండన్ తన ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ చేసింది. ఈ ఈవెంట్ కి తమన్నాతో పాటు విజయ్ వర్మ కూడా వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలను చూస్తే ఇద్దరు విడి విడిగా రవీనా టండన్ ఇంటికి వచ్చి వెళ్లినట్టు తెలుస్తుంది.

విడిపోయినా… మేం సంతోషంగానే ఉన్నామని, బాధ పడటం లేదు అని చెప్పడానికే ఈ హోలీ ఈవెంట్ కి వచ్చి ఉంటారని అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

ఏది ఏమైనా… పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పొచ్చు. విడిపోతే… పార్టీలు చేసుకోవడం, ఈవెంట్స్ కు వెళ్లడం చేస్తూ… బంధాలను తెంచుకున్నా తాము హ్యాపీగానే ఉన్నామని ప్రూవ్ చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×