BigTV English

RamCharan: రీరిలీజ్ కి సిద్ధమవుతున్న రామ్ చరణ్ మూవీ.. ఎప్పుడంటే..?

RamCharan: రీరిలీజ్ కి సిద్ధమవుతున్న రామ్ చరణ్ మూవీ.. ఎప్పుడంటే..?

RamCharan: ప్రస్తుత కాలంలో స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వి.వి. వినాయక్ (VV.Vinayak) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నాయక్ (Nayak). ఈనెల 27వ తేదీన రీ రిలీజ్ కానుంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో అమలాపాల్ (Amala Paul), కాజల్ అగర్వాల్(Kajal Agarwal)హీరోయిన్లుగా నటించగా.. బ్రహ్మానందం(Brahmananram), జయప్రకాష్ రెడ్డి(Jaya Prakash Reddy)తదితరులు కీలకపాత్ర పోషించారు. ఇకపోతే మెగా అభిమానులు ప్రతి ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈసారి అంతకుమించి బర్తడే వేడుకలు జరపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నాయక్ సినిమాను రీ రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.


రీ రిలీజ్ కి సిద్ధమైన రామ్ చరణ్ నాయక్ మూవీ..

ఇకపోతే యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరు సొంతం చేసుకున్న వి.వి.వినాయక్ కూడా ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన కామెడీ ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పటికీ సినిమాలోని కామెడీ సీన్స్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో ఛార్మీ స్పెషల్ సాంగ్ లో చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2013 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయడంతో మెగా అభిమానులకు ఈ సినిమా ఎప్పుడూ ఒక స్పెషల్ మూవీ అనడంలో సందేహం లేదు. ఈసారి మళ్లీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


రామ్ చరణ్ సినిమాలు..

రామ్ చరణ్ ఈ ఏడాది సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను చవిచూశారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ ఆలస్యం చేయకుండా.. బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ చాలా విభిన్నంగా ఉండబోతుందని సమాచారం. ఇందులో కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Siva Raj Kumar) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. ఒక మొత్తానికి అయితే భారీ తారాగణంతో ఊహించని అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రామ్ చరణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత ఆర్సి 17 చిత్రం కూడా చేయబోతున్నారు రామ్ చరణ్. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో తన 17వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇక మొత్తానికైతే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని మరి ముందడుగు వేస్తున్నారు రామ్ చరణ్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×