SSMB 29:సాధారణంగా పండుగ వచ్చిందంటే చాలు.. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఇంటికి వెళ్లలేనివారు, పని ప్రదేశాలలోనే తోటి వారితో పండుగల సెలబ్రేట్ చేసుకొని సరిపెట్టుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలోనే ఒక సినిమా షూటింగు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో..ఈ చిత్ర హీరోయిన్ సెట్ లో ఉండే యూనిట్ తో హోలీ సెలబ్రేట్ చేసుకొని, ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆమె ఎవరో కాదు గ్లోబల్ ఐకాన్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). అసలు విషయంలోకి వెళ్తే.. ఈసారి హోలీ పండుగ యూనిట్ తో సెట్ లోనే జరుపుకున్నాము అంటూ ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే.. హోలీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది ప్రియాంక చోప్రా. వీటికి మహేష్ బాబు(Maheshbabu ) సతీమణి నమ్రత (Namrata) కూడా రిప్లై ఇవ్వడం గమనార్హం.
చాలా పగడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి..
అసలు విషయంలోకి వెళ్తే.. రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న రాజమౌళి అందుకు తగ్గట్టుగానే ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాలను ఎంచుకొని మరీ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇక ఇందులో గ్లోబల్ ఐకాన్ సార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికవగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య షూటింగ్ మొదలవగా.. ఇప్పటికే హైదరాబాదులో కాశీ సెట్ వేసి ఇండోర్ షూటింగ్ పూర్తి చేయగా ఇప్పుడు ఒరిస్సాలో అవుట్డోర్ షూటింగ్ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఒడిస్సా లోని కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
సినిమా సెట్ లోనే హోలీ సెలబ్రేషన్స్..
ఇక ఒడిస్సాలో జరుగుతున్న ఈ కొత్త షెడ్యూల్ కి ప్రియాంక చోప్రా హాజరయ్యింది. అందులో భాగంగానే పండుగ పూట కూడా షూటింగ్ తప్పలేదు అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్ పెట్టింది. హోలీ రోజు కూడా మాకు వర్కింగ్ డే అని, తన టీం తో హోలీ ని సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను కూడా ఈమె షేర్ చేసింది. ఇక ప్రియాంక చోప్రా వేసిన పోస్ట్ కి నమ్రత స్పందించడంతో ఇది ఎస్ ఎస్ ఎం బి 29 సెట్ అని అర్థమవుతుంది. ఇకపోతే హ్యాపీ హోలీ అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్ కి నమ్రత కూడా కామెంట్ పెట్టేసింది. మొత్తానికి అయితే ప్రియాంక చోప్రా సెట్ లోనే ఉండి టీం తో హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
చిత్ర బృందానికి కఠినమైన ఆంక్షలు విధించిన రాజమౌళి..
ఇకపోతే ఈ సినిమా నుండి ఎటువంటి లీక్స్ బయటకు రాకుండా రాజమౌళి చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెట్లో సెల్ ఫోన్స్ వాడకూడదని, ఫోటోలు తీయకూడదని ఆర్డర్ వేశారు. అయినా సరే సినిమా నుండి చిన్నచిన్న లీకులు బయటకు రావడంతో జక్కన్న మూవీ లీకుల నుండి ఎప్పుడు తప్పించుకుంటుందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తూ ఉండగా.. హాలీవుడ్ నుంచి ఇతర టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.