Star Heroine : సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది.. రోజుకో హీరోయిన్ కొత్త సినిమాలతో పరిచయం అవుతున్నారు. ఇలాంటి టైం లో ఒక్క పని వల్ల ఇండస్ట్రీని వదిలెయ్యడం మంచిది కాదు.. ఎందుకంటే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినప్పుడే వాడుకోవాలి. లేదంటే మాత్రం మళ్లీ అలాంటి ఛాన్స్ రావడం కష్టం.. హీరోయిన్ గా రాణించాలంటే.. అందించవచ్చిన ప్రతి అవకాశాన్ని చేజార్చుకోకుండా వాడుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీలో కొంతకాలం కొనసాగుతారు. ఇదంతా ఎందుకు అనే సందేహం రావచ్చు.. ఇలా చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓ స్టార్ హీరోయిన్ డైరెక్టర్ చెప్పిన పనికి నో చెప్పడమే కాదు ఏకంగా ఇండస్ట్రీనే వదిలేసింది. నిజంగా ఆ హీరోయిన్ ఘట్స్ కు మెచ్చుకోవాల్సిందే.. ఎవరు ఆ హీరోయిన్ అనుకుంటున్నారు కదూ.. ఇంక ఆలస్యం ఎందుకు ఆ హీరోయిన్ ఎవరో వివరంగా తెలుసుకుందాం..
హీరోయిన్ గా కేరీర్ ముందుకు సాగాలంటే అన్ని పాత్రలు, సీన్స్ చెయ్యాల్సి ఉంటుంది. కొంతమంది హీరోయిన్లు ఎలాంటి ఎక్స్‌ఫోజింగ్ చేయకుండా.. తమకు నచ్చిన పాత్రలోనే నటిస్తూ.. తమకు వచ్చిన అవకాశాలలోనే తమ ప్రతిభను కనబరుస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. అలాగే ఓ బాలీవుడ్ బ్యూటీ లిప్స్ లాక్ ఇష్టం లేక రెండు భారీ హాలీవుడ్ సినిమాలనే వదులుకుంది.. అంతేకాదు జీవితంలో ఇక అక్కడ సినిమాలు చెయ్యనని చెప్పడం గొప్ప విషయం.. ఆమె మరెవ్వరో కాదు బ్లూ ఐస్ బ్యూటీ ఐశ్వర్య రాయ్.. ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె అందానికి ఐకాన్. ఎంతమంది అందగర్తలు నిలిచిన ఆమెకు సాటిరారు. అలాంటి అందం ఆమె సొంతం. ఇప్పటికి సినిమా అవకాశాలు తగ్గట్లేదు అంటే ఇక అర్థం చేసుకోవాలి ఆమె క్రేజ్ ఏంటనేది.
ఐసూ అందానికి ప్రతి హీరో ఫిదా అయ్యేవాడు. ఆమెతో సినిమాలు చెయ్యాల్సిందే అని డైరెక్టర్స్ ను ఫోర్స్ చేసి సినిమాల అవకాశాలు ఇచ్చేవారట. బాలీవుడ్ సినిమాలు వరుస హిట్లు కావడంతో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో ఆమెకు హాలీవుడ్ లో కూడా నటించే అవకాశం వచ్చింది. ఇలా బ్రైడ్ అండ్ ప్రిజుడీస్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ప్రొవోక్డ్ వంటి హాలీవుడ్ సినిమాల్లో ఆఫర్స్ ఈమె తలుపు తట్టాయి. కానీ ఈమె బోల్డ్ సీన్స్ చెయ్యలేక ఇండస్ట్రీకి దూరం అయ్యిందని అప్పటిలో వార్తలు వినిపించాయి. ఇక తెలుగులో, తమిళ్, బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటించింది. ఇక ఈ మధ్య అభిషేక్ బచ్చన్ తో విడాకుల వార్తలు వినిపించాయి. అయితే భర్తతో విడాకులు తీసుకుందా? లేదా? అన్నది తెలియలేదు కానీ సోషల్ మీడియాలో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు అంటూ వార్తలు మాత్రం రోజుకొకటి వైరల్ అవుతుంది. ఏది ఏమైనా వీరిద్దరూ క్లారిటి ఇస్తే తప్ప అసలు నిజం ఏంటో తెలియదు.. ఐశ్వర్య చివరిగా మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ II లో నటించింది. అందులో ఐశ్వర్య నటనకు యావత్ సినీ అభిమానులు ఫిదా అయ్యారు..