హైదరాబాదులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మరోసారి నగరంలో తుపాకీ శబ్ధం మోగింది. ప్రియురాలిని దూరం చేస్తున్నాడనే కోపంతో ఓ యువకుడు అమ్మాయి తండ్రిని తుపాకీతో కాల్చాడు. అయితే అది ఎయిర్ గన్ కావడంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 14లో ఓ అపార్ట్మెంట్ లో రేవంత్ ఆనంద్ (57) పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బాధితుడి కంటి నుండి బుల్లెట్ దూసుకెళ్లింది.
Also read: పాపం పండిందా? వంశీరాం బిచాణా ఎత్తేస్తున్నాడా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రేవంత్ ఆనంద్ కూతురు మాన్విత అంబర్ పేట్ కు చెందిన బల్విందర్ సింగ్ అనే యువకుడిని ప్రేమించింది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే కూతరు ప్రేమ వ్యవహారం ఇష్టం లేదని తండ్రి ఎవరికీ తెలియకుండా కూతురిని అమెరికా పంపించాడు. దీంతో తన ప్రియురాలిని దూరం చేసినందుకు బల్వీందర్ సింగ్ కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలో అమ్మాయి తండ్రిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.
నేడు బల్వీందర్ సింగ్ ఎయిర్ గన్ తీసుకుని ప్రేయసి ఇంటికి వెళ్లగా ఆమె తండ్రితో గొడవ జరిగింది. ఇరువురి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రేయసి తండ్రి రాయితో కొట్టి బొమ్మ తుపాకీతో బెదింరించారు. ఆ తరవాత బల్వీందర్ సింగ్ తన వెంట తెచ్చుకున్న ఎయిర్ గన్ తో కంట్లో కాల్చగా బుల్లెట్ కంటి నుండి దూసుకెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు