BigTV English

Rewind 2024 : ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. ఆ మూవీ రికార్డులు బ్రేక్..

Rewind 2024 : ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. ఆ మూవీ రికార్డులు బ్రేక్..

Rewind 2024 : దేశ వ్యాప్తంగా పుష్ప 2 మేనియా కొనసాగుతుంది. రెండు వారాలు పూర్తి చేసుకుంది. అయినా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గేదేలే అంటూ కోట్లు రాబడుతున్నాయి. రెండు వారాలకు గాను 1600 కోట్లకు పైగా వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక జనవరి 9 న ఓటీటిలో రిలీజ్ కాబోతుంది. అప్పటివరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ మూవీ కలెక్షన్స్ 2 వేల కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అటు నార్త్ లో కూడా ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. ఇక ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షీంచిన మూవీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


తాజాగా బుక్ మై షో ప్రకారం 2024లో ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలవడం విశేషం. నిజానికి ఈ ఏడాది టాలీవుడ్, బాలీవుడ్ లలో ఎన్నో పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర రికార్డులను బ్రేక్ చెయ్యడంతో పాటుగా ముందు రిలీజ్ అయిన సినిమాలకు పోటీ ఇస్తుంది. మరి ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో ఏ మూవీ అరుదైన రికార్డులను బ్రేక్ చేసిందో చూడాలి..

2024 లో బుక్ మై షోలో ఎక్కువ మంది చూసిన మూవీ.. 


మరో పది రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుంది. ఈ ఏడాది హైలెట్ అయిన అంశాలను ఎలాగైతే గుర్తు చేసుకుంటున్నామో సినిమాలను కూడా అలాగే లెక్క వేస్తున్నాం. మరి ఈ ఏడాది బుక్ మై షోలో ఎక్కువ మంది వీక్షించిన మూవీ విషయానికొస్తే.. తాజాగా ప్రముఖ యాప్ బుక్ మై షో త్రో బ్యాక్ పేరిట ఇయర్ ఎండ్ రిపోర్టును రిలీజ్ చేసింది. ఇందులో పుష్ప 2 ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా అని బుక్ మై షో అనౌన్స్ చేసింది. ఇది విన్న బన్నీ ఫ్యాన్స్ ఏ రికార్డును బ్రేక్ చెయ్యడంలో పుష్ప రాజ్ వెనక్కి తగ్గేదేలే అంటున్నారు..

మరోవైపు బాలీవుడ్ లో ఈ ఏడాది రికార్డులు తిరగరాసిన హారర్ కామెడీ మూవీ స్త్రీ2ని వెనక్కి నెట్టింది. శుక్రవారం బుక్ మై షో ఈ రిపోర్టు రిలీజ్ చేసింది. దీని ప్రకారం పుష్ప 2 మూవీ 10.8 లక్షల సోలో వ్యూయర్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలిపింది. ప్రీ బుకింగ్స్ అలాగే, అలాగే బుకింగ్స్ లో కూడా రికార్డులు బ్రేక్ చేసిన హారర్, కామెడీ మూవీ స్త్రీ 2 రికార్డుల ను కూడా బుక్ మై షోలో బ్రేక్ చేసింది పుష్ప 2.. ఇక ఏడాదిలో ఒక రోజు అత్యధిక టికెట్లు అమ్ముడైన రికార్డు నవంబర్ 1 అని బుక్ మై షో తెలిపింది. ఆ రోజు రికార్డు స్థాయిలో ఏకంగా 2.3 మిలియన్ల టికెట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. ఈ ఏడాది రీరిలీజ్ అయిన సినిమాలకు కూడా టికెట్ల అమ్మకాలు భారీగా ఉన్నట్లు తెలిపింది.. అంతేకాదు 2024లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడినట్లు తాజా బుక్ మై షో రిపోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది మొత్తంగా 319 నగరాల్లో జరిగిన 30,687 లైవ్ ఈవెంట్ల టికట్లను బుక్ మై షో అందుబాటులో ఉంచింది.. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది ఎక్కువ మంది విక్షించిన మూవీగా పుష్ప 2 నిలవడం విశేషం..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×