BigTV English

Devara: కమిట్మెంట్ అడిగితే తప్పేంటి.. ఒక్కసారిగా షాక్ ఇచ్చిన దేవర బ్యూటీ..!

Devara: కమిట్మెంట్ అడిగితే తప్పేంటి.. ఒక్కసారిగా షాక్ ఇచ్చిన దేవర బ్యూటీ..!

Devara: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఆడవారిని ఇబ్బంది పెడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎప్పుడైతే మాలీవుడ్ సినీ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక బయటకు వచ్చిందో.. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతే కాదు అప్పటి వరకు సైలెంట్ గా వున్న ఎంతోమంది క్యాస్టింగ్ కౌచ్ బాధితులు కూడా ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకొచ్చారు. అంతేకాదు సమంత(Samantha), అనుష్క(Anushka)లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా టాలీవుడ్ లో కూడా జస్టిస్ హేమా కమిటీ లాంటి కమిటీ వేయాలని చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇక టాలీవుడ్ లో కూడా ఈ సమస్య ఉందా అంటూ పెదవి విరిచారు. ఇలా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఒక్కొక్కరు చెప్పుకుంటుంటే.. కమిట్మెంట్ అడిగితే తప్పేంటి? అంటూ ఒక బ్యూటీ చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. మరి ఆమె ఎవరో? అసలు ఏం జరిగిందో? ఇప్పుడు చూద్దాం.


దేవర సినిమాతో గుర్తింపు..

ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా, కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘దేవర’. ఇందులో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) భైర అనే విలన్ పాత్రలో నటించారు. ఆయన కొడుకు పసురా.. ఈ పసురా కి గర్ల్ ఫ్రెండ్ గా చంద్రకళ అనే పాత్రలో లతా విశ్వనాథరెడ్డి (Latha Vishwanath Reddy)నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో కనిపించింది రెండు మూడు సన్నివేశాలలో అయినా విపరీతంగా తన నటనతో అబ్బురపరిచింది.ముఖ్యంగా ఈమె పాత్ర మాస్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లతా విశ్వనాథరెడ్డి ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్లు చేసింది.


కమిట్మెంట్ పై లతా విశ్వనాథరెడ్డి షాకింగ్ కామెంట్స్..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు.. “ఇండస్ట్రీలో అమ్మాయిలు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు కదా.. మీరు కూడా ఎదుర్కొన్నారా?” అని యాంకర్ ప్రశ్నించింది. దానికి లతా విశ్వనాథరెడ్డి..” మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు కదా.. మీరు ఏమైనా క్యాస్టింగ్ వచ్చి ఎదుర్కొన్నారా ?” అంటూ తిరిగి ప్రశ్నించింది. తమకు క్యాస్టింగ్ కౌచ్ సమస్య లేదని, యాంకర్ బదులివ్వగా.. మీకే క్యాస్టింగ్ కౌచ్ సమస్య లేనప్పుడు మరి మాకు ఎందుకు ఉంటుంది? అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పి అబ్బురపరిచింది. ఎక్కడికి వెళ్లినా ఒకటే.. ప్రతి ఇండస్ట్రీలో కూడా అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటారు. వారి మధ్య అట్రాక్షన్ రావడం కూడా సహజమే. అయితే వాళ్ళు అడగడంలో తప్పులేదు.. నచ్చకపోతే దానిని తిరస్కరించడంలో మన తప్పేం లేదు.. అది చాలా సాధారణమైన విషయం అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.ముఖ్యంగా కమిట్మెంట్ అనేది వ్యక్తి నుండి వ్యక్తికి వేరేగా ఉంటుందని అది మన అభిప్రాయాలను బట్టి మారుతుందని, తాను ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా.. తాను మాత్రం ఆ సమస్య ఎదుర్కోలేదని తెలిపింది. ముఖ్యంగా అవకాశాలు రాని వాళ్లే ఇలాంటి ఆరోపణలు చేస్తారంటూ కూడా తెలిపింది లతా విశ్వనాథరెడ్డి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×