SBI Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ భారీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13, 735 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇందుకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఫీజులతో పాటు నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 13, 735
విద్యార్హతలు: ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా కోర్సులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థలు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: అభ్యర్థులు వయస్సు ఏప్రిల్ 1,2024 నాటికి 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 2, 1996 నుంచి ఏప్రిల్ 1, 2004 మధ్య పుట్టిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల గరిష్ట వయో పరిమితి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లై చేసుకునే విధానం:
అప్లై చేసుకోవాలని అనుకునే అభ్యర్థులు ముందుగా ఏప్రిల్ SBI అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
తర్వాత హోం పేజ్ లో కనిపించే కెరీర్స్ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతోంది. తర్వాత కరెంట్ ఓపెనింగ్ లింక్ పై క్లిక్ చేయాలి.
అనంతరం కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ పేజ్‌లో ఉన్న SBI junior associate లింక్ పై క్లిక్ చేయాలి.
అప్పుడు అప్లికేషన్ లింక్ వస్తుంది. లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
తర్వాత అకౌంట్‌కి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్‌లో వివరాలు నమోదు చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
చివరగా ఫామ్ ని సబ్మిట్ చేసి ఫీజు చెల్లించాలి. అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దీని ప్రింట్ తీసుకోవాలి.
పరీక్ష విధానం: ఆన్ లైన్ టెస్ట్, స్థానిక భాషలో పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: డిసెంబర్ 17, 2024
చివరి తేదీ: జనవరి 7, 2024