E-Paper
Advertisement

Brahmanandam: చిరు కాళ్లు మొక్కిన బ్రహ్మానందం.. వీడియో వైరల్

Brahmanandam: చిరు కాళ్లు మొక్కిన బ్రహ్మానందం.. వీడియో వైరల్
Advertisement

Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం- మెగాస్టార్ చిరంజీవి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మానందాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిరునే అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఎన్నోసార్లు బ్రహ్మీ ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు. చిరంజీవి.. తనలో ఉన్న నటుడునే కాదు లెక్చరర్ ను కూడా గౌరవిస్తారని తన బుక్ లో రాసుకొచ్చారు. ఇక నిన్న జరిగిన సావిత్రి క్లాసిక్ బుక్ లాంచ్ లో చిరు, బ్రహ్మీ సందడి చేశారు. రావడం రావడమే బ్రహ్మీ.. చిరు కాళ్లను మొక్కడానికి ప్రయత్నించాడు. వెంటనే చిరు ఆయనను వారించి కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే చాలామంది బ్రహ్మీ ఏంటి చిరు కాళ్లు మొక్కడం ఏంటి.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

బ్రహ్మీ, చిరు వయస్సు 68 సంవత్సరాలే. వారి మధ్య అనుబంధం కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. చిరు అంటే బ్రహ్మీకి ఎనలేని అభిమానం. లెక్చరర్ గా పనిచేస్తూ.. నటనపై ఆసక్తితో జంధ్యాలను కలుసుకోవడానికి వచ్చారు. ఆ సమయంలోనే చిరు చంటబ్బాయ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. అక్కడ చిరు గెటప్ చూసి బ్రహ్మీ నవ్వాడట. వెంటనే చిరుకు కోపం వచ్చి.. ఎవరయ్యా అతను.. చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు.. బయటికి పంపించేయండి అన్నారట. ఇక జంధ్యాల జోక్యం చేసుకొని బ్రహ్మానందం ఒక లెక్చరర్ అని పరిచయం చేయగానే చైర్ లో నుంచి లేచి మాట్లాడి పంపారట.

ఇక ఉన్న కొద్దిసేపు కూడా తన ఛలోక్తులుతో కడుపుబ్బా నవ్వించడంతో మంచి కమెడియన్ అవుతావని చిరంజీవి చెప్పారట. అంతేకాకుండా చంటబ్బాయ్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా నటించాడు బ్రహ్మీ. అనంతరం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్ళంట సినిమాలో అరగుండు పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఆ గౌరవం, ప్రేమతోనే బ్రహ్మీ.. చిరు కాళ్లు మొక్కినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×