BigTV English

Couple Fighting: ప్రేయసితో సహజీవనం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, ఆపై ఫైటింగ్

Couple Fighting: ప్రేయసితో సహజీవనం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, ఆపై ఫైటింగ్

Couple Fighting: వారిద్దరు చూడముచ్చటైన జంట. వారి మధ్య ఏం జరిగిందో తెలీదు. ప్రేయసితో సహజీవనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్యతో ఫైటింగ్‌కు దిగాడు. సింపుల్‌గా చెప్పాలంటే అర్థరాత్రి ఫైటింగ్‌కు దారితీసింది. ఈ క్రమంలో గాయపడిన మొదటి భార్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.


పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆకుల వాసు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందినవాడు. రెండేళ్ల కిందట నవ్యశ్రీతో మ్యారేజ్ జరిగింది. పెళ్లి సమయంలో జరగాల్సిన తతంగాలు సంప్రదాయ ప్రకారమే జరిగింది. ఈ జంటను చూసి చుట్టుపక్కలవారు ఆడిపోసుకునే వారు. తమకు ఇలాంటి కొడుకు గానీ, కూతురు గానీ ఉంటే బాగుండేదని ముచ్చట్లు పెట్టుకునేవారు.

ఆకుల వాసు – నవ్యశ్రీ మధ్య ఏం జరిగిందో తెలీదు. కలతలు లేని సంసారంలో ఒక్కసారిగా భారీ కుదుపు మొదలైంది. భార్యభర్తల మధ్య విభేదాలు పొడచూపాయి. ఒకరి ముఖం మరొకరు చూసుకోలేని స్థాయికి వెళ్లిపోయారు. కాకపోతే సంప్రదాయం ప్రకారం పెద్దలు నిర్ణయించిన పెళ్లి కావడంతో కొన్నాళ్ల తర్వాతైనా కలతలు సద్దు మణుగుతాయని భావించారు ఇరు కుటుంబాల పెద్దలు.


సీన్ కట్ చేస్తే.. వీణా గాయత్రి అనే బంధువుల అమ్మాయిని మరో పెళ్లి చేసుకున్నాడు ఆకుల వాసు. కొంతకాలంగా నవ్యశ్రీకి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నచ్చినప్పుడు ఇంటికి వచ్చేవాడు. అసలు భార్య నవ్యశ్రీ గురించి పట్టించుకునేవాడు కాదు. నాలుగు గోడల మధ్య గొడవ బయటకు వచ్చింది. భార్యభర్తల మధ్య రచ్చకు దారితీసింది.

ALSO READ:  అసెంబ్లీకి రాకుంటే.. పులివెందులకు ఉపఎన్నిక.. డిప్యూటీ స్పీకర్ జోస్యం

సత్తెనపల్లిలోని ఓ ఇంట్లో ఆసుల వాసు-గాయత్రి ఉన్నారని చుట్టుపక్కల వారి ద్వారా సమాచారం తెలుసుకుంది భార్య నవ్యశ్రీ. వెంటనే బంధువులతో కలిసి వాసు సీక్రెట్ నివాసానికి వచ్చింది నవ్యశ్రీ. ఎలాగైనా తమ మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించింది. ఇరువురు మధ్య కాసేపు మాటల యుద్ధానికి దారితీసింది. నేరుగా బెడ్ రూంలోకి వెళ్లి ప్రియురాలు గాయత్రి చెంప ఛెళ్లు మనిపించింది నవ్యశ్రీ.

తన భార్యనే కొడతావంటూ నవ్యశ్రీ, ఆమె బంధువులపై దాడికి యత్నించాడు వాసు. వెంటనే నవ్యశ్రీ, ఆమె బంధువులు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ కాసేపు ఫైటింగ్ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నవ్యశ్రీకి గాయలయ్యాయి. వెంటనే ఆమె ఆసుపత్రిలో చేర్పించారు ఆమె బంధువులు. ఈ వ్యవహారం చివరకు పోలీసుస్టేషన్‌కు దారి తీసింది. మరి భార్యభర్తల మధ్య వ్యవహారానికి పోలీసులు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.

 

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×